టాలీవుడ్‌లో ఒక హీరోయిన్ 20 ఏళ్లపాటు స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవడం అరుదు. ఆ అరుదైన రికార్డును సాధించింది స్వీటీ అనుష్క శెట్టి. 2005లో ‘సూపర్’తో తెరంగేట్రం చేసిన అనుష్క, ఇప్పుడు 2025లో ‘ఘాటీ’ వరకు విజయవంతమైన సినీ జర్నీని కొనసాగిస్తోంది. ఈ రెండు దశాబ్దాల కెరీర్‌లో ఆమె వేసిన ప్రతి అడుగు ప్రత్యేకమైంది.అరుంధతి, సరోజ, దేవసేన, భాగమతి, రుద్రమదేవి … ఇలా ఓ సైడ్ హీరో ఉన్నా లేకపోయినా బాక్సాఫీస్ దగ్గర తన మీదే ఆధారపడి హిట్స్ ఇచ్చిన హీరోయిన్‌గా అనుష్క ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇండస్ట్రీలో సోలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనే రికార్డులు క్రియేట్ చేసిన స్టామినా ఉన్న నటి ఇప్పుడు ఆమె ఒక్కరే.


ఇక తాజాగా రాబోతున్న ‘ఘాటీ’ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. క్రిష్ డైరెక్షన్‌లో అనుష్క పవర్‌ఫుల్ రోల్ చేస్తుండటంతో బజ్ మరింత పెరిగింది. అయితే, ఈ సినిమా ప్రమోషన్లలో అనుష్క కనిపించకపోవడం మాత్రం అభిమానులకు కొంచెం మిస్ అయిన ఫీలింగ్ ఇచ్చింది. ఇదే విషయం గురించి డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ – “అనుష్క గారు ప్రమోషన్స్‌లో రావాల్సిన అవసరం లేదు. ఆమె పెర్ఫార్మెన్స్ చాలు” అని అన్నారు. కానీ స్వీటీ మాత్రం ఆ మాటలతో ఏకీభవించలేదు. “క్రిష్ గారు అభిమానంతో అలా చెబుతారు. కానీ సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే ప్రమోషన్స్ తప్పనిసరి. ఈసారి నాకు వ్యక్తిగత కారణాల వల్ల ప్రమోషన్స్ చేయలేకపోయాను. అది నా దురదృష్టం.



 కానీ క్రిష్ గారు, నిర్మాత రాజీవ్ గారు చాలా మంచి మనసుతో అర్ధం చేసుకున్నారు” అంటూ తన మనసులోని నిజాలు బయటపెట్టింది. అనుష్క చెప్పిన మాటల్లో వందశాతం నిజమే. ఈ రోజుల్లో మంచి సినిమా తీయడమే కాదు, దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఇప్పుడు క్రిష్ ప్రమోషన్స్‌లో శక్తివంచన లేకుండా జోరుగా పనిచేస్తున్నారు. అనుష్క కూడా ఆడియో లాంచ్‌లో పాల్గొని కొంతవరకూ ఆ లోటును భర్తీ చేసింది.మొత్తానికి… 20 ఏళ్ల జర్నీ తర్వాత కూడా అనుష్క క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ‘ఘాటీ’ విజయంతో ఆమె కెరీర్‌లో మరో మైలురాయిని సృష్టించే అవకాశం ఉంది. నిజంగానే టాలీవుడ్‌లో స్వీటీకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది అన్నది మళ్లీ నిరూపితమవుతోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: