
ఈ నేపథ్యంలోనే ప్రభాస్ చేతులమీదుగా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఈ గ్లింప్స్ విషయానికి వస్తే అనుష్క మాస్ యాక్షన్ సన్నీవేషాలు హైలెట్గా ఇందులో చూపించారు. కత్తి పట్టి తిప్పే యాక్షన్స్ సన్నివేశాలు కూడా అద్భుతంగా కనిపిస్తున్నాయి. అనుష్క నటనకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తోడవడంతో వన్ మ్యాన్ షో చేసినట్టుగా కనిపిస్తోంది. అనుష్క ఘాటి సినిమా కోసం చాలా గట్టిగానే కష్టపడినట్టుగా ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు రేపటి రోజున థియేటర్లోకి విడుదల కాబోతోంది.
క్రిష్, అనుష్క కాంబినేషన్లో వచ్చిన వేదం సినిమా తర్వాత మళ్లీ ఘాటి సినిమా రాబోతోంది. ఈసారి అరుంధతి, భాగమతి సినిమాలను మించి మరి ఈ సినిమా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందనే విషయం రేపటి రోజున తెలుస్తోంది. అయితే అనుష్క మాత్రం ప్రమోషన్స్ లో పాల్గొనక పోయినప్పటికీ అభిమానుల్లో కొంత నిరాశ కలిగిన సినిమా సక్సెస్ తర్వాత అయినా పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి అనుష్క పడ్డ కష్టానికి ఏమాత్రం ఫలితం ఉంటుందో చూడాలి.