
తాజాగా కెన్యాలో జరుగుతున్న షూటింగ్ కి సంబంధించి మహేష్ బాబు లుక్ ఒకటి లీక్ అయినట్లు వైరల్ గా మారుతోంది. ఎండలో కొండల మధ్య ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ మహేష్ బాబు లుక్ చూసి ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా లయన్ తో పాటు వాకింగ్ చేస్తున్న ఫోటో, మరొక ఫోటోతో బ్యాక్ సైడ్ నుంచి మహేష్ బాబు చేతిలో గొడ్డలి పట్టుకున్న ఫోటో వైరల్ గా మారుతోంది. ఈ ఫోటోలు చేసిన ఫ్యాన్స్ మహేష్ బాబుతో ఏదో గట్టి ప్లానే చేశారు రాజమౌళి. ఈసారి ఆస్కార్ గ్యారెంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఫోటోలు ఎంతవరకు నిజమో తెలియదు కానీ మొత్తానికి సోషల్ మీడియాని మాత్రం షేక్ చేస్తున్నాయి. ఇటీవలే మహేష్ బాబు బర్తడే సందర్భంగా ఫేస్ కనిపించకుండా విడుదల చేసిన ఫోటో రిలీజ్ చేశారు చిత్ర బృందం.నవంబర్లో SSMB 29 కి సంబంధించి పూర్తి అప్డేట్ ఇస్తానంటు రాజమౌళి తెలియజేశారు. ఈ సినిమాని పాన్ వరల్డ్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో చూడాలి. చివరిగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఈ సినిమా ఫ్యాన్స్ కి బాగా అలరించింది.