
ప్రియాంక చోప్రా ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ.. చాలామంది మగాళ్లు తమకు కాబోయే భార్య వర్జిన్ గా ఉండాలనుకుంటారు.. కానీ వర్జిన్ అనే పదం తన దృష్టిలో అంత ముఖ్యమైనది కాదని వర్జినిటీ అనేది కేవలం ఒక్క రాత్రి తోనే పోతుంది.. దానిని పెద్దగా పట్టించుకోవద్దు.. అర్థం చేసుకునే అమ్మాయి మాత్రమే మనకు భార్యగా రావాలని , మనకు నచ్చిన విధంగా ఉండే అమ్మాయి మన జీవితంలోకి భాగస్వామిగా రావడం ముఖ్యమని తెలిపింది. ప్రేమించిన ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలని లేదు అందుకు అదృష్టం ఉండాలి అంటూ తెలిపింది.
తన దృష్టిలో వర్జినిటీ గురించి పెద్దగా పట్టించుకోనని ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ప్రియాంక చోప్రా నటించిన సీటాడెల్ సినిమా కూడా విడుదల అయింది. ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు ,రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. వివాహం అనంతరం అమెరికాలో సెటిల్ అయిన ప్రియాంక చోప్రా మొదటిసారి మహేష్ బాబు సినిమా కోసం ఇండియాకి వచ్చి ఇక్కడ పలు ప్రాంతాలను సందర్శించింది. SSMB 29 సినిమాతో తన రేంజ్ ను మళ్ళీ మార్చుకునేలా చూస్తోంది ప్రియాంక చోప్రా.