తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఫేమస్ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులలో సీనియర్ నటి సుధా కూడా ఒకరు.. ఒకప్పుడు చేతినిండా అవకాశాలతో సీనియర్ నటి సుధ ఎన్నో సినిమాల్లో నటించింది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకొని హీరో హీరోయిన్లకు తల్లిగా.. అత్తగా.. వదినగా.. అక్కగా..ఇలా ఎన్నో కీలక పాత్రల్లో పోషించి అత్త,అమ్మ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది.అయితే అలాంటి సీనియర్ నటి సుధాకి ఉదయ్ కిరణ్ తో మంచి బాండింగ్ ఉండేది.అంతే కాదు ఉదయ్ కిరణ్ ని దత్తత తీసుకుంటానని కూడా పలు ఇంటర్వ్యూలలో చెప్పి ఆయన చనిపోయిన సమయంలో బాధతో కన్నీళ్లు పెట్టుకుంది.. అయితే అలాంటి సుధా కి ఈ మధ్యకాలంలో ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి కొత్త కొత్త వాళ్ళు ఎంట్రీ ఇవ్వడంతో సుధాకి అవకాశాలు లేకుండా పోతున్నాయి. 

అలా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ వస్తుంది.అయితే అలాంటి సీనియర్ నటి సుధా గురించి తాజాగా ఒక సంచలన విషయం బయటపడింది.అదేంటంటే సుధా కి సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఫోటోలు చూసిన చాలామంది జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి ఈ ఫోటోలలో ఉన్నది సుధా నేనా అంటూ షాక్ లో మునిగిపోతున్నారు.అయితే సీనియర్ నటి సుధా కి సంబంధించిన ప్రైవేట్ ఫొటోస్ తాజాగా రాధాకృష్ణ అనే వ్యక్తితో పాటు కొంతమంది ట్విట్టర్ పేజీల నిర్వాహకులు తమ సోషల్ మీడియా ఖాతాలో అసభ్యకరంగా పోస్ట్ లు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. ఇక ఈ విషయం కాస్త సుధా వరకు చేరడంతో అది చూసిన సుధా షాక్ అయిపోయి వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

 ఇక ఆ ట్విట్టర్ పేజీల నిర్వహకులు సుధాకి సంబంధించి ప్రైవేట్ ఫోటోలు పోస్ట్ చేయడమే కాకుండా బెదిరింపులకు కూడా గురి చేస్తున్నారట. రాధాకృష్ణ అనే వ్యక్తి సుధా కి ఫోన్ చేసి నువ్వు నాతో కలిసి ఉన్న టైంలో దిగిన కొన్ని ఫోటోలు, ప్రైవేట్ వీడియోలు నా దగ్గర ఉన్నాయి..అవి మీడియాకి లీక్ చేస్తాను అంటూ సుధా ని బెదిరింపులకు గురి చేస్తున్నారట. అయితే  ఎలాంటి తప్పు చేయని సుధా ఎందుకు భయపడుతుంది.వెంటనే రాధాకృష్ణతోపాటు తనపై అసభ్యకర పోస్టులు ట్విట్టర్ లో పెట్టిన ట్విట్టర్ పేజీల నిర్వాహకులపై కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వెంటనే యాక్షన్ తీసుకోవాలని తెలియజేసిందట.ప్రస్తుతం సుధా పెట్టిన కేసుని నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: