
అసలు సినిమా బాగుందో లేదో థియేటర్ కి వెళ్లి చూడాలి కదా అంటూ ఎంతోమంది దర్శక ,నిర్మాతలు, హీరోలు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లకపోవడానికి ముఖ్య కారణం.. సినిమా టికెట్ రేటు కంటే తిను బండారుల రేటు అధికంగా ఉండడం.. నలుగురు ఉన్న కుటుంబ సభ్యులు గతంలో రూ.500 రూపాయలతో దర్జాగా వెళ్లి వచ్చే స్టేజ్ నుంచి ప్రస్తుత పరిస్థితులలో 2000 వేల నుంచి 3000 వేల రూపాయలు ఖర్చవుతుంది. దీనివల్ల భవిష్యత్తులో కూడా సినిమాలు నాశనం అయ్యేలా చేస్తున్నాయి. ఇప్పటికే చాలా థియేటర్లు మూసి వేయడమే కాకుండా కొన్ని ప్రైవేట్ ఫంక్షన్లకు ఇచ్చేస్తున్నారు.వీటికి తోడు భారీ బడ్జెట్ సినిమాలని, హీరోలు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.. దీనివల్ల సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచేస్తున్నారు.
గతంలో వంద రూపాయల లోపు టికెట్ ధరలు ఉండగా చాలామంది విపరీతంగా సినిమాకి వెళ్లేవారు.. కచ్చితంగా వారంలో ఒకటి రెండు సినిమాలు చూసేవారు ప్రేక్షకులు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ibomma ,హెచ్డి ప్రింట్, ఓటీటిలలో చూసేస్తున్నారు. సినిమా టికెట్ ధర ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో 250 నుంచి 350 వరకు పలుకుతోంది. ఇక థియేటర్ లోపల పాప్ కార్న్ విషయానికి వస్తే రూ. 250 నుంచి 450 రూపాయల వరకు ఉన్నది. సమోసా కూడా రూ 80 రూపాయలు, స్వీట్ కార్న్ వంటివి రూ.80 రూపాయల వరకు అమ్ముతున్నారు వాటర్ బాటిల్ రూ .30 నుంచి రూ .40 రూపాయల వరకు అమ్ముతున్నారు. థియేటర్లలో ఈ ఖర్చు తగ్గించకపోతే.. రాబోయే రోజులు సినిమాలు కూడా కనుమరుగవుతాయి.