టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సొంత అన్నదమ్ములే అనే విషయం మనం ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎక్కువ శాతం రాజకీయాలకు సమయాన్ని కేటాయిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలకు ముందు కమిట్ అయిన సినిమాలను ప్రస్తుతం పూర్తి చేస్తున్నాడు.

అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తాజాగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఓజి అనే మూవీ ని పూర్తి చేశాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 25nవ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను , పాటలను విడుదల చేశారు. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను పెద్ద ఎత్తున మరికొన్ని రోజుల్లోనే మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన ఓజి సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ ను అత్యంత పెద్ద ఎత్తున నిర్వహించాలి అని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా తీసుకురావాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందులో భాగంగా చిరంజీవి ని సంప్రదించగా ఆయన కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఈవెంట్ కు చిరంజీవి రావడం , ఆ ఇద్దరు ఒకే స్టేజిపై ఉండే అవకాశాలు ఉండడంతో మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఆ ఈవెంట్ ను ఓజి మేకర్స్ నిర్వహిస్తారా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: