
ఇలాంటి సందర్భంలో రీసెంట్‌గా ప్రభాస్ చేసిన ఒక చిన్న పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మిరాయి’ అనే సినిమా కోసం ప్రభాస్ తన వాయిస్ ఓవర్ ఇచ్చాడు. కేవలం కొన్ని సెకండ్ల పాటు మాత్రమే ఆయన వాయిస్ వినిపించినా, అది సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలిచింది. ప్రభాస్ వాయిస్ సినిమాకి ఒక కొత్త రేంజ్ ఇచ్చింది. అంతకు ముందు ఆయన ‘కన్నప్ప’ సినిమాలో ఒక చిన్న గెస్ట్ రోల్‌లో కనిపించి అభిమానులను అలరించాడు. ఆ కేమియో ఆయన కెరీర్‌లో ఒక బిగ్ ప్లస్‌గా మారింది. ఇవి రెండూ ప్రాజెక్ట్స్ కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ప్రభాస్ రేంజ్, ఆయనకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ దృష్ట్యా ఆయన డిమాండ్ చేస్తే నిమిషానికి కోట్ల రూపాయలు ఇచ్చినా అందరూ ఇచ్చే పరిస్థితి ఉంది.
అయినా ప్రభాస్ మాత్రం డబ్బు ఆశించకుండా, కేవలం ఫ్రెండ్‌షిప్ కోసం, తన స్నేహితులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాల్లో భాగమయ్యాడు. ఈ ఉదారతే ప్రభాస్‌ను మరింత ప్రత్యేకంగా నిలిపింది. ప్రభాస్ చేసిన ఈ సహాయం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే మిగతా స్టార్ హీరోల విషయంలో మాత్రం విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో ఒక చిన్న గెస్ట్ రోల్ చేయాలన్నా, లేదా వాయిస్ ఓవర్ చెప్పాలన్నా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటారు కొందరు స్టార్స్. కానీ ప్రభాస్ మాత్రం అంత పెద్ద పేరు, ఇమేజ్, క్రేజ్ ఉన్నా కూడా ఒక రూపాయి కూడా తీసుకోకుండా తన స్నేహితుల సినిమాలకు తోడ్పడుతున్నాడు.
దీని వల్ల సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. "ప్రభాస్ నిజంగా గ్రేట్! ఇండస్ట్రీలో ఇంత పెద్ద స్టార్ ఇంత సింపుల్‌గా, మనసు పెట్టి సహాయం చేయడం గొప్ప విషయం" అని జనాలు ఆయనను ఆకాశానికెత్తుతున్నారు. అదే సమయంలో పక్క హీరోలపై నెగిటివ్ కామెంట్స్ కూడా పెరుగుతున్నాయి. "ప్రభాస్‌ను చూసి నేర్చుకోండి! మీరు ఎందుకు ఇండస్ట్రీకి దండగలా ప్రవర్తిస్తున్నారు?" అంటూ జనాలు వారిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ప్రభాస్ చేసిన మంచి, ఆయన చూపించిన వినయం ఇప్పుడు మరింతగా ఆయన ఇమేజ్‌ను పెంచింది. స్టార్ హీరోలందరికీ ప్రభాస్ ఒక లెసన్ నేర్పుతున్నట్టుగా మారిపోయాడు. క్రేజ్ ఉన్నా సింపుల్‌గా ఉండటం, స్నేహితుల కోసం మనసు పెట్టి సహాయం చేయడం వల్లే ఆయన ఈ స్థాయిలో అభిమానుల మనసుల్లో దేవుడి స్థాయిలో నిలిచిపోయాడు. కొందరు దీనిని నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు..!!