టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న యువ నటులలో తేజ సజ్జ ఒకరు. ఈయన కొంత కాలం క్రితం హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. హనుమాన్ లాంటి భారీ సక్సెస్ తర్వాత తేజ , కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మీరాయ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా తాజాగా నవంబర్ 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషలలో విడుదల అయింది.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బుక్ మై షో లో ఓ రేర్ ఫీట్ ను సాధించింది. బుక్ మై షో లో ఈ సినిమాకు సంబంధించిన 1 మిలియన్ టికెట్లు ఇప్పటికే సేల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికి కేవలం మూడు రోజులు మాత్రమే అవుతుంది. మూడు రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన 1 మిలియన్ టికెట్స్ బుక్ మై షో లో సేల్ అయ్యాయి అంటేనే అర్థం అవుతుంది ఈ సినిమా ఏ స్థాయిలో ఇంపాక్ట్ ను చూపుతోందో.

ఇక ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ మూవీ లాంగ్ రన్ లో భారీ కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఈ మూవీ కి మంచి టాక్ రావడంతో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత రెండవ , మూడవ రోజులు కూడా ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు దక్కినట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమా ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: