సినిమా ఇండస్ట్రీలో ఏ సమయంలోనైనా ఏం జరిగినా ఆశ్చర్యం అనిపించని పరిస్థితి ఏర్పడింది. ఒక్క రాత్రిలోనే ఒక భారీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ల మార్పు జరగడం ఇప్పుడు కోలీవుడ్టాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ మధ్య వరకూ హీరోయిన్ సాయిపల్లవి ఈ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్‌కి కన్‌ఫర్మ్ అయ్యిందని ప్రచారం జరిగింది. ఇండస్ట్రీలో టాక్ కూడా బలంగా వినిపించింది. అయితే ఊహించని విధంగా ఒక్క రాత్రికే పరిస్థితులు మారిపోయి, సాయి పల్లవి స్థానంలో నేషనల్ క్రష్ రష్మిక మందనను తీసుకొచ్చారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.


కోలీవుడ్ ఇండస్ట్రీలో శింబుకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా లవర్ బాయ్‌గా, రొమాంటిక్ హీరోగా ఆయనకి మంచి ఇమేజ్ ఉంది. ఇలాంటి హీరో సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటించినా ఆ సినిమా ఆటోమేటిక్‌గా అటెన్షన్ దక్కించుకుంటుంది. అందుకే మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ సాయిపల్లవేనని చాలా బలమైన టాక్ వచ్చింది. కానీ అనుకోకుండా డైరెక్టర్ డిసిషన్ మార్చుకుని, రష్మిక మందన్నాను ఫైనల్ చేశారని సమాచారం.



ఇక సోషల్ మీడియాలో అయితే ఈ వార్త పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. “ఎందుకు సాయి పల్లవిని తప్పించారు? ఎందుకు రష్మికను తీసుకున్నారు?” అన్న ప్రశ్నలపై క్లారిటీ రాకపోయినా, కొంతమంది మాత్రం సాయి పల్లవిసినిమా చేయకపోవడమే మంచిదని కామెంట్స్ చేస్తున్నారు. కారణం ఏమిటంటే, శింబుతో జతకడితే హీరోయిన్లపై ఎప్పుడూ రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఆయనతో నటించే ప్రతి హీరోయిన్‌పై “ఎఫైర్‌లో ఉన్నారు” అనే గాసిప్స్ రచ్చ చేస్తుంటాయి. అదే కారణంగా సాయి పల్లవి ఈ సినిమాలో భాగం కాకపోవడం చాలా బెటర్ అని ఆమె అభిమానులు భావిస్తున్నారు. అదే సమయంలో రష్మిక మందన్నా ఎంట్రీపై కొందరు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రష్మికకు నేషనల్ లెవెల్‌లో క్రేజ్ ఉంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్నీ కలిపి పాన్-ఇండియా స్టార్‌డమ్ దక్కించుకున్న హీరోయిన్. కాబట్టి ఈ సినిమా రేంజ్ మరింత పెరుగుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి, సాయి పల్లవి స్థానంలో రష్మిక మందన ఎంట్రీ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌పై కొత్త అంచనాలు మొదలయ్యాయి. రాత్రికి రాత్రే చేతులు మారిన ఈ భారీ సినిమా, రిలీజ్ అవ్వకముందే సంచలనం సృష్టించడం మొదలుపెట్టింది. ఇక సినిమా సెట్స్‌పైకి వెళ్ళాక మరి ఎలాంటి సర్ప్రైజ్‌లు బయటకు వస్తాయో చూడాలి..??

మరింత సమాచారం తెలుసుకోండి: