పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన ఓజి సినిమాను ఈ నెల అనగా సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను ఒక దాని తర్వాత ఒక దానిని ఫుల్ స్పీడ్ గా కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంపాదించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాకు యు / ఏ సర్టిఫికెట్ వచ్చినందుకు చాలా మంది షాక్ అవుతున్నట్లు తెలుస్తుంది. అది ఎందుకు అనుకుంటున్నారా ..? ఈ మూవీ నుండి మొదట విడుదల చేసిన గ్లీమ్స్ వీడియోను బ్లడ్ బాత్ అనే పేరుతో విడుదల చేశారు. అలాగే ఆ వీడియో కూడా భారీ రక్తం పాత సన్నివేశాలతో ఉంది. అలాగే ఈ మూవీ బృందం ఆ తర్వాత విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో కూడా భారీ రక్త పాతం ఉండే సన్నివేశాలు ఉన్నాయి.

దానితో ఈ సినిమాలో అదిరిపోయే రేంజ్ లో రక్త పాత సన్నివేశాలు ఉంటాయి అని , దానితో ఈ సినిమాకి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయని అనేక మంది అభిప్రాయ పడ్డారు. కానీ ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటించగా ... సుజిత్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని డి వి వి దానయ్య నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: