టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ సోదరుడు అయినటువంటి ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆనంద్ దేవరకొండ "దొరసాని" అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో ఆనంద్ కూడా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తర్వాత ఆనంద్ చాలా సినిమాల్లో హీరో గా నటించాడు. కొంత కాలం క్రితం ఈయన బేబీ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాంతం చేసుకుంది.

ఈ సినిమాతో ఈయనకు మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ "90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్" వెబ్ సిరీస్ దర్శకుడు అయినటువంటి ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే ఆనంద్ దేవరకొండ , ఆదిత్య హాసన్ కాంబో లో రూపొందుతున్న సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను ప్రముఖ ఓ టీ టీ సంస్థలలో ఒకటి అయినటువంటి ఆహా సంస్థ వారు ఏకంగా 11 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆహా సంస్థ వారు ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో థియేటర్లలో విడుదల చేసే లక్ష్యంగా చేసుకొని భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన 90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ అద్భుతమైన ప్రేక్షక ఆదరణ పొందడం తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా ఆనంద్ దేవరకొండ , ఆదిత్య హాసన్ కాంబో లో రూపొందుతున్న సినిమాపై ప్రస్తుతానికి మాత్రం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: