బాలీవుడ్ లో తన హవా కొనసాగించాలని చూస్తోంది హీరోయిన్ రష్మిక. అందుకే తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని దూసుకుపోతోంది. ఇప్పుడు తాజాగా క్రిష్ ఫ్రాంచైజీ నాల్గవ భాగంలో రష్మిక అడుగుపెట్టబోతున్నట్లు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుని హీరో హృతిక్ రోషన్ నటిస్తూ ఉండగా డైరెక్టర్గా కూడా ఆయన బాధ్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకువెళ్లి 2027లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.


గత మూడు సినిమాల మాదిరిగా ఇందులో కూడా సూపర్ హీరో ఎలిమెంట్స్, యాక్షన్స్ సన్ని వేషాలు, విజువల్ ఎఫెక్ట్స్ కే ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. బాలీవుడ్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే రష్మిక తో క్రిష్ 4 కి సంబంధించి సంప్రదింపులు చిత్ర బృందం జరిగినట్లు వినిపిస్తున్నాయి.ఆమె కథ ,పాత్ర నచ్చిందని  రష్మిక నటించేందుకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలబడే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.


మరి రష్మిక క్రిష్ -4 లో ఎంట్రీ తో ఈ ప్రాజెక్టు మరింత ఆకర్షణీయంగా మారుతుంది. రష్మిక , హృతిక్ మొదటిసారి స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో రష్మికకు భారీగానే క్రేజ్ ఉంది. అదే క్రేజ్ ను  బాలీవుడ్ లో కూడా సంపాదించుకొని స్టార్ స్టేటస్ ని అందుకోవాలని చూస్తోంది. ఇక అభిమానులు ఈ కాంబినేషన్ కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాం అంటూ తెలియజేస్తున్నారు. వరుస బ్లాక్ బాస్టర్ సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక ఈ కాంబినేషన్ ఓకే అయితే  ఖచ్చితంగా హిట్ కొడుతుందని అభిమానులు భావిస్తున్నారు. తెలుగులో విషయానికి వస్తే రష్మిక, విజయ్ దేవరకొండ తో ఒక సినిమాలో నటించడానికి సిద్ధమయ్యింది.. ది గర్ల్ ఫ్రెండ్, తామ , కాక్టెయిల్ 2 వంటి  చిత్రాలకు సంబంధించి షూటింగ్ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: