వెంకటేష్ – త్రివిక్ర‌మ్ కాంబినేషన్‌ ఎప్పటి నుంచో అభిమానులు ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌. ఎట్టకేల‌కు ఈ సినిమా సెట్ అవ్వడంతో సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించగా, ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 6 నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోందని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక‌పై కూడా చాలా చర్చ జరిగింది. త్రిష, మీనాక్షి చౌదరి వంటి పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చినా, చివరికి "కేజీఎఫ్" ఫేమ్ శ్రీనిధి శెట్టిని హీరోయిన్‌గా ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. వెంకీతో ఆమె జోడీగా ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. త్రివిక్ర‌మ్ కెరీర్ చూసుకుంటే, గుంటూరు కారం తరువాత ఆయన చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే. మధ్యలో బన్నీతో సినిమా చేయాలని అనుకున్నా, ఆ ప్రాజెక్ట్ జరగలేదు. తర్వాత అదే కథను ఎన్టీఆర్‌కు చెప్పినా, ఆయన ఇతర కమిట్‌మెంట్స్ కారణంగా ఆలస్యమైంది.


దీంతో గ్యాప్‌లో వెంకీ సినిమా మొదలెట్టాలని త్రివిక్ర‌మ్ నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఈ స్క్రిప్ట్ పనులపైనే దృష్టి పెట్టారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నట్టు సమాచారం. వెంకీ ఇంతకుముందు చేసిన ఫ్యామిలీ డ్రామాలు బాక్సాఫీస్ వద్ద సూప‌ర్ హిట్లు కొట్టాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. టైటిల్ కూడా ఇప్పటికే రిజిస్టర్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫైన‌ల్‌గా వెంకటేష్ – త్రివిక్ర‌మ్ కాంబో ఫైనల్‌గా స్టార్ట్ కావడంతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా వెంకీ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశముందని అభిమానులు ఆశిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: