
] సాయి పల్లవి ఇలా బట్టలు ధరించడం చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. కొందరు అభిమానులు “ఇలాంటి డ్రెస్సులు ఆమెకు బాగా ఉన్నాయి!” అని ప్రశంసిస్తున్నారు, మరికొందరు మాత్రం “సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కానీ బికినీ వేసుకుని విదేశాల్లో అందాలు చూపించడానికి ఏం అడ్డుకాదు” అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి కి సంబంధించిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారాయి. కొంతమంది అభిమానులు ఫొటోల్ని ప్రేమతో చూడగా, కొంతమంది నెగిటివ్ రియాక్షన్స్ కూడా ఇస్తున్నారు. “సాయి పల్లవిలో కూడా ఇలాంటి యాంగిల్‌లు ఉంటాయా?” అని ఆశ్చర్యపడుతూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా కొన్ని హద్దులు మీరాల్సి వస్తుంది. సాయి పల్లవి కూడా అందుకు అతీతం కాదని, ఈ ఫొటోలు దీనికి మంచి ఉదాహరణ అని నెటిజన్లు ఘాటుగా రియాక్ట్ చేస్తున్నారు. కాగా హీరోయిన్ సాయి పల్లవి గ్లామర్ అనే పదానికి చాలా చాలా దూరంగా ఉంటుంది. కేవలం నటనకూ ఆస్కారమున్న చిత్రాలు మాత్రమే నటిస్తూ సావిత్రి, సౌందర్యల తర్వాతి ఆ ప్లేసును రీప్లేస్ చేసే తరహా గుర్దింపును సైతం సంపాదించుకుంది. టాలీవుడ్‌లో అయితే ఏకంగా లేడీ పవర్ స్టార్ అనే స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. అలాంటి హీరోయిన్ ఇలా బికినీ వేసుకోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంసంగా మారింది..!!