ఇప్పుడు రాజమౌళికి ఉన్నలాంటి గుర్తింపు రాంగోపాల్ వర్మ ఎప్పుడో తెచ్చుకున్నారు. ఆయన తన సినిమాలతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. అయితే అలాంటి రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఎలాంటి స్టేజ్ లో ఉన్నారో చెప్పనక్కర్లేదు.ఆయన తీసే సినిమాలు చాలా అగ్లీగా ఉండడంతో పాటు ఎక్కువగా బోల్డ్ నెస్ పెంచి వెరైటీ వెరైటీ సినిమాలు తీస్తూ ఉంటారు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఆ నిర్మాతకు పైత్యం బాగా పెరిగిపోయింది అంటూ ఓ బాలీవుడ్ నిర్మాతను టార్గెట్ చేస్తూ ఆర్జీవి వేసిన సెటైర్లు అప్పట్లో తెగ వైరల్ గా మారాయి. ఇక ఆ నిర్మాత ఎవరయ్యా అంటే బోనీకపూర్...ఇక అసలు విషయం ఏమిటంటే.. మహేష్ బాబు భూమిక కాంబినేషన్లో వచ్చిన ఒక్కడు సినిమా అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమా రీమేక్ అయిన అన్ని భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 

కానీ ఒక్క హిందీలో తప్ప.. అయితే హిందీలో ఈ సినిమాని తెరకెక్కించేటప్పుడు నిర్మాత కథ పూర్తిగా మార్చేశారట.ముఖ్యంగా విలన్ నుండి నిస్సహాయురాలైన హీరోయిన్ ని హీరో ఎలా కాపాడతారు అనేది ఈ సినిమా స్టోరీ. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ సినిమాకి హైలెట్. నువ్వేం మాయ చేసావో గానీ అనే పాట హీరోయిన్  స్వచ్ఛమైన మనసును తెలుపుతుంది. అయితే బాలీవుడ్ లో ఈ సినిమాని రీమేక్ చేసిన సమయంలో హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ కి పెద్ద పెద్ద సెట్లు వేసి 500 మంది బ్యాక్గ్రౌండ్ డాన్సర్లను పెట్టి చాలా పెద్ద ఎత్తున నిర్మాత ప్లాన్ చేశారట.ఈ విషయంలో ఆర్జీవి అడ్డు చెప్పి ఇలా చేస్తే బాగుండదు అని అంటే లేదు లేదు మన సినిమా మొత్తం రిచ్ గానే ఉంటుంది.

బడ్జెట్ చాలా బాగా పెట్టాను..అంటూ నిర్మాత బదులిచ్చారట.ఈ సినిమాకి హైలైట్ అయిన సాంగ్ నే అంత గ్రాండ్ గా తీస్తే సినిమాలో ఉన్న కథ మొత్తం అడ్డం తిరుగుతుంది అని అప్పుడే ఆర్జీవి అనుకున్నారట. అనుకున్నట్టుగానే ఒక్కడు మూవీ రీమేక్ గా తెరకెక్కిన బాలీవుడ్ తేవార్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయ్యింది. ఇక ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవి మాట్లాడుతూ.. నిర్మాత పైత్యం వల్లే తేవార్ సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమాలో ఉన్న కథ మొత్తం మార్చేస్తే ఆడియన్స్ కి అది ఎలా కనెక్ట్ అవుతుంది అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఇక ఒక్కడు మూవీ రీమేక్ ని బాలీవుడ్లో అర్జున్ కపూర్ సోనాక్షి సిన్హా కాంబో లో తెరకెక్కించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: