పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న చిత్రం ఓజి. ఈ రోజున పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యింది. నిన్నటి రోజు రాత్రి నుంచే ప్రీమియర్స్ తో మొదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సంపాదించకుంది. పవన్ అభిమానులకు ఫుల్ మీల్స్ ఈ సినిమాతో లభించింది. పవన్ కళ్యాణ్ నటనతో అదరగొట్టేసారని చెప్పవచ్చు. ఒకపక్క థియేటర్లలో హౌస్ ఫుల్ అవుతూ ఉంటే మరొకపక్క ఓటీటికి సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు వినిపిస్తోంది.


ఓజి సినిమాతో పాటు థియేటర్లో ఓటిటి స్ట్రీమింగ్ పార్ట్నర్ ను కూడా అధికారికంగా ప్రకటించినట్లు సమాచారం. ఓజి సినిమాని ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ లలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నెలరోజుల తరువాతే ఓటీటిలోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ మాత్రమే కాకుండా ఓటిటి బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు వినిపించాయి. సుమారుగా రూ .80 కోట్ల రూపాయల వరకు ఓజీ సినిమా ఓటీటి రైట్స్  పలికినట్లుగా వినిపిస్తున్నాయి.


సినిమా రిలీజ్ బట్టి హిట్ అయితే ఈ దీన్ని మరింత పెంచేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఓజి సినిమా భారీ హిట్ తో దూసుకుపోతోంది. కాబట్టి ఖచ్చితంగా మరింత అమౌంట్ పెంచే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నాయి. పవన్ కు జోడిగా ప్రియాంక మోహన్ నటించిగా.. విలన్ గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి నటించారు. ఇక మొదటి రోజే కలెక్షన్స్ పరంగా రూ .100 కోట్లకు పైగా కొల్లగొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దసరా సెలవులు కావడం చేత పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో సరికొత్త రికార్డులను సృష్టించేలా కనిపిస్తోంది. మరి ఓజి చిత్రంతో పవన్ కళ్యాణ్ ఎలాంటి రికార్డులను తిరగ రాస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: