శ్రీదేవిని బోనీ కపూర్ రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే బోనీ కపూర్ కి పెళ్ళై కొడుకు కూతురు కూడా ఉన్నారు.కానీ పెళ్లయి పిల్లలు ఉన్న బోనీ కపూర్ శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.అలాగే శ్రీదేవి పై కూడా చాలామంది విమర్శలు చేశారు. శ్రీదేవికి పెళ్లి చేసుకోవడానికి వేరే మగాడు దొరకలేదా.. రెండో పెళ్లి వాడే దొరికాడా అంటూ చాలామంది మాట్లాడుకున్నారు. అయితే వీరి ప్రేమ పెళ్లి విషయం ఏమోగానీ తాజాగా తమ రహస్య పెళ్లి గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు బోనీ కపూర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్న సమయంలో తన కొడుకు చేసిన పనికి ఆశ్చర్యపోయారట. మరి ఇంతకీ అర్జున్ కపూర్ చేసిన పనేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

బోనీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..శ్రీదేవి నేను పెళ్లి చేసుకునే సమయంలో ఈ విషయం మొత్తాన్ని ముందుగానే నా మొదటి భార్య మోనాకి తెలిపాను. ఇక మోనా కూడా ఆ రెండో పెళ్లికి చెప్పలేదు. అంతేకాదు మోనా కొనిచ్చిన రింగ్స్ తోనే శ్రీదేవి నేను పెళ్లి చేసుకున్నాము.. ఇక మోనా నా జీవితంలో గొప్ప పాత్ర పోషించింది. నేను శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకున్నా కూడా పిల్లలకు నా మీద శ్రీదేవి మీద విషం నింపలేదు . ఎప్పుడు ప్రేమగానే ఉండాలని చెప్పేది. అలాగే శ్రీదేవిని పెళ్లి చేసుకున్న సమయంలో నా కొడుకు ఓ లేఖ ద్వారా నాన్న ఎందుకు ఇంటికి రారు అంటూ అడిగాడు. ఆ సమయంలో చాలా బాధపడ్డాను.

ఇక ఆ టైంలో మోనా ఇద్దరు పిల్లలతో ఉండడం అలాగే శ్రీదేవి ఒంటరిగా ఉండడం వీరిద్దరి విషయంలో నాకు చాలా బాధనిపించింది.అయితే నా మొదటి భార్య పిల్లలు తల్లితోపాటు తాతమ్మ తో కలిసి ఉండేవారు. కానీ శ్రీదేవి ఒంటరిగా ఉండేది కాబట్టి ఆమెతోనే నేను ఉండేవాడిని. ఇక శ్రీదేవి మరణించిన సమయంలో నా మొదటి భార్య పిల్లలకు రెండో భార్య పిల్లలకు మధ్య సఖ్యత ఏర్పడింది. అర్జున్ కపూర్ అంషుల ఇద్దరు శ్రీదేవి మరణించినప్పుడు జాన్వీ కపూర్ కి ఖుషి కపూర్ కి అండగా నిలిచారు. ప్రస్తుతం వారంతా ఓ ఫ్యామిలీ గా ఉన్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బోనీ కపూర్.

మరింత సమాచారం తెలుసుకోండి: