అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవిపై సెటైరికల్ గా మాట్లాడిన తీరుపై ఇప్పటికే ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఓవైపు మెగా ఫ్యాన్స్ జగన్ ఫ్యాన్స్ కలిసి అనంతపురంలో బాలకృష్ణ దిష్టిబొమ్మ దహనం చేయడంతో పాటు చాలామంది మెగా అభిమానులు వెంటనే బాలకృష్ణ చిరంజీవికి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.ఇలాంటి నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నుండి ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం నిజంగా ఆశ్చర్యమే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా అన్ని విషయాల్లో వేలు పెట్టే నాగబాబు అన్నని అంత మాట అన్నా కూడా ఎందుకు స్పందించలేదు. ప్రతి ఒక్క విషయంలో నాగబాబు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు.అలాంటిది సొంత అన్నను అంత పెద్ద మాట అంటే ఎందుకు గమ్మున కూర్చొని ఉన్నారు అంటున్నారు చాలామంది నెటిజెన్లు.

అంతేకాదు చిరంజీవి లేకపోతే మాకు లైఫ్ లేదని అన్నయ్య వల్లే మాకు ఈ లైఫ్ వచ్చిందని అన్నయ్య వేసిన బిక్ష అంటూ ప్రతిసారి చెప్పుకునే పవన్ కళ్యాణ్,నాగబాబులు ఎందుకు చిరంజీవి గురించి అలా వ్యంగ్యంగా మాట్లాడితే స్పందించడం లేదు అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ అంటే కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. అలాగే డిప్యూటీ సీఎం కాబట్టి రాజకీయంగా ఏమైనా ఇబ్బందులు వస్తాయని ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతుంది అనే ఉద్దేశంతో మాట్లాడడం లేదు కావచ్చు. మరి నాగబాబు ఎందుకు స్పందించడం లేదు. ఆయన కూడా జనసేన ఎమ్మెల్సీగా ఉన్నారని స్పందించడం లేదా.. ఒకవేళ బాలకృష్ణ గురించి మెగా బ్రదర్స్ స్పందిస్తే ఎక్కడ వైసీపీకి చులకన అవుతామని, వైసిపికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే స్పందించడం లేదా..

రాజకీయాల కోసం సొంత అన్నని ఏమని విమర్శించినా స్పందించరా అంటూ చాలామంది మెగా బ్రదర్స్ మౌనం పై విమర్శలు చేస్తున్నారు.. ప్రత్యర్థి పార్టీకి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో సొంత అన్నని ఏమన్నా స్పందించకపోవడం నిజంగా అవమానమే అంటున్నారు. అన్న పేరు చెప్పుకొని ఎదిగాం అంటున్నారు కానీ అన్నని అవమానిస్తే మాత్రం నోరు విప్పడం లేదు. మిగతా వారు మెగాస్టార్ చిరంజీవిని ఏమైనా అన్నప్పుడు లేచిన నోరు బాలకృష్ణ అంటే ఎందుకు లేవడం లేదు అంటూ ఫైర్ అవుతున్నారు.మరి చూడాలి చిరంజీవిపై బాలకృష్ణ చేసిన కామెంట్లపై మెగా బ్రదర్స్ ఇద్దరు నోరు విప్పి స్పందిస్తారా.. లేక రాజకీయాల కోసం మౌనం పాటిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: