
"పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే"..ఓజి చూసి మహేశ్ చేత అలాంటి పని చేయించబోతున్న రాజమౌళి..?!

సోషల్ మీడియాలో ఇప్పుడు సుజిత్ పేరు మారుమ్రోగిపోతోంది. ఆయనను టాలెంటెడ్ డైరెక్టర్‌గా కాకుండా, టాప్ ప్లేస్లో ఉన్న సక్సెస్‌ఫుల్ మేకర్‌గా చూసే స్థాయికి తీసుకెళ్లింది ఓజి. అభిమానులను అర్థం చేసుకోవడం, వాళ్ల ఆశలు నెరవేర్చడం, అదే డైరెక్టర్‌కి పెద్ద విజయమని ఇండస్ట్రీ చెబుతోంది.ఇక ఈ విజయాన్ని చూసి మరొక పెద్ద డైరెక్టర్ అయిన ఎస్.ఎస్. రాజమౌళి తన ప్లాన్ లో మార్పులు చేస్తారని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. నిజానికి మహేశ్ బాబు కోసం ఆయన ప్లాన్ చేస్తున్న సినిమాలో కొన్ని వైలెంట్ సీన్స్ ఉన్నాయట. కానీ మహేశ్ అభిమానులు ఆ రకం రోల్‌ను ఆయన నుంచి యాక్సెప్ట్ చేయలేరని భావించి ఆ సీన్స్ తొలగించారని టాక్. "మహేశ్‌కి వైలెన్స్ సూట్ అవ్వదు, ఆయన ఇమేజ్‌కి తగదు" అన్న ఫ్యాన్స్ ఒత్తిడితో ఆ ట్రాక్స్ లేపేసారట.
కానీ ఓజి సినిమా చూసాక మాత్రం పరిస్థితి మారిపోయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనను ఎలాగైతే అంగీకరించారో, మహేశ్ అభిమానులు కూడా అదేవిధంగా ఎక్సెప్ట్ చేస్తారని రాజమౌళి నమ్మకంగా భావిస్తున్నారట. అందుకే మునుపు తీసేసిన ఆ వైలెంట్ సీన్స్‌ని మళ్లీ సినిమాలో పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారని టాక్ హాట్ టాపిక్ అవుతోంది. ఇదే విషయాన్ని చూసి సోషల్ మీడియాలో జనాలు రచ్చ చేస్తున్నారు. "పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే" అంటూ రాజమౌళి మీద మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి సూట్ అయ్యే మేనరిజం, ఆ యాటిట్యూడ్, ఆ బాడీ లాంగ్వేజ్ మహేశ్ బాబుకి ఎప్పటికీ సూట్ అవ్వదని జనాలు చెబుతున్నారు. మహేశ్ అంటే సాఫ్ట్ ఇమేజ్, క్లాస్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ – ఇవే సూట్ అవుతాయి గాని, వైలెన్స్ డామినేట్ అయిన రోల్ ఆయన మీద ప్రయోగిస్తే రిస్క్ అవుతుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో సోషల్ మీడియాలో మహేశ్ ఫ్యాన్స్ కూడా రాజమౌళికి సజెషన్స్ ఇస్తున్నారు . మొత్తానికి ఓజి సక్సెస్ వేవ్‌లో సుజిత్ పేరు స్టార్ డైరెక్టర్ల సరసన నిలబడగా, అదే వేవ్‌లో రాజమౌళి కూడా తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఇప్పుడు టాక్ నడుస్తోంది. "ఒక హీరోని అభిమానులు ఎలాగైతే చూడాలని అనుకుంటారో, అలా చూపించడం కంటే గొప్ప విజయం మరొకటి లేదు!"..!!