
కానీ షూటింగ్ సమయంలో కొన్ని సీన్స్ ఎక్కువ కాలం తీసుకోవడంతో..కొన్ని సందర్భాల్లో కథకు కనెక్షన్ కొంతగా కోల్పోయినట్లయిపోయిందట. ఈ సమస్యను గమనించిన కొరటాల, చాలా ఆలోచన తర్వాత, సినిమా రెండు భాగాలుగా రిలీజ్ చేయడం ఉత్తమమని నిర్ణయించారట. ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్‌కు వివరించినప్పుడు, మొదట అతను కొంచెం సంకోచించాడట. ఇలాంటి స్టోరీని రెండు భాగాలుగా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా..? అని భయపడ్డారట. కానీ కొరటాల కన్వీన్స్ చేసిన పద్ధతిని చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారట.
ఆ తర్వాత, కొరటాల శివ ప్రత్యేకంగా ఈ నిర్ణయాన్ని వీడియో రూపంలో అభిమానులకు వివరించారు.ఈ వీడియో రిలీజ్ అయిన తరువాత, ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు మొదటిసారి ఒక సినిమా రెండు భాగాలుగా అనౌన్స్ చేయడం విశేషం. ఇప్పటికే పలువురు హీరోలు రెండు భాగాల సినిమాల్లో క్రేజీ హిట్స్ సాధించినందున, జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా అలాంటి హిట్ కావాలని అభిమానులు ఆశించారు. సినిమాకు సంబంధించిన టాక్ నార్మల్ గానే ఉన్నా..ఆ క్రేజ్ మాత్రం వేరే లెవల్ లో ఉందని చెప్పవచ్చు. కానీ, ఎన్టీఆర్ నటనలో మాత్రం ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేదు. అందుకే, దేవర సినిమా అంటే అభిమానులకి ఎంతో ప్రేమ మరియు గర్వం. చూడాలి ఇవాళ్ళ ఏమైన దేవర 2 పై అప్డేట్ ఇస్తారు ఏమో మూవీ మేకర్స్..???