కాంతార ఈ సినిమా వచ్చినప్పుడు మొదట్లో  ఏదో చిన్న సినిమా అనుకున్నారు. కానీ ఒక వారం రోజుల్లో అన్ని చిత్రాలను దాటేసి ఈ సినిమా టాప్ ప్లేస్ కి వెళ్ళిపోయింది. అంతే కాదు ఇండియా మొత్తంలో  అద్భుతమైన కలెక్షన్స్ సాధించి కన్నడ హీరో రిషబ్ శెట్టికి దేశవ్యాప్తంగా మంచి పేరు తీసుకువచ్చింది.రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో  రూపొందించిన కాంతార మూవీ రికార్డుల మోత మోగించింది. అలాంటి ఈ తరుణంలో ఈ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార: చాప్టర్ 1 చిత్రం త్వరలో రిలీజ్ కి సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా అక్టోబర్ 2 న విడుదలవబోతోంది. ఈ క్రమంలోనే రిషబ్ శెట్టి తాజాగా తన సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. 

అది కూడా తెలుగు ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈవెంట్. అయితే ఈ ప్రోగ్రాంలో రిషబ్ శెట్టి తను మాట్లాడిన మాటలు మొత్తం కన్నడలోనే మాట్లాడారు. దీంతో తెలుగు అభిమానులంతా అసంతృప్తికి లోనైనట్టు  తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకుల కోసం సినిమా ప్రమోట్ చేస్తున్నారు. హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు.కనీసం కొన్ని పదాలైనా తెలుగులో మాట్లాడాలి కదా అంటూ సోషల్ మీడియా వేదికగా చాలామంది నెటిజన్స్ ఏకీపారేస్తున్నారు.. ముందుగా తెలుగు నేర్చుకుని  ఇలాంటి ఈవెంట్లకు హాజరవ్వు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కట్ చేస్తే ఇదే ప్రోగ్రాంలో రిషబ్ శెట్టి జూనియర్ ఎన్టీఆర్ గురించి  మాట్లాడారు.

 ఎన్టీఆర్ తన స్నేహితుడని  చెప్పడంతో అక్కడికి వచ్చిన అభిమానులంతా కేరింతలు కొట్టారు. ఈ విధంగా ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడంతో ఈ సినిమాకి మరింత ప్రమోషన్ చేసే అవకాశం వచ్చింది. ఇక సినిమా విషయానికొస్తే..  కాంతార మూవీ ఇప్పటికే జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. దానికి ప్రీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా కూడా గుర్తింపు పొందుతుందని చాలామంది భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భక్తి భావంతో ఎలా మెదులుతారు అనేది ఈ సినిమాలో ఎక్కువగా చూపించారని తెలుస్తోంది. మరి చూడాలి కాంతార సినిమాలాగే కాంతార: చాప్టర్ 1 కూడా హిట్ అవుతుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: