బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో కి సోదరుడుగా ఇండస్ట్రీలోకి నటుడుగా, విలన్గా , నిర్మాతగా ,డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాలలో కనిపించారు నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్. తెలుగు ,హిందీ, మలయాళం వంటి భాషలలో కూడా నటించి పేరు సంపాదించారు. మలయాళం ఇండస్ట్రీలో ఆడియన్స్ ని అలరించిన అర్బాజ్ ఖాన్ ప్రముఖ నటి మలైక అరోరా ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి 19 ఏళ్లు కాపురం చేసి ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చారు. వీరి కుమారుడి పేరే ఆర్హాన్ ఖాన్,అయితే అనుప్యంగా వీరి జీవితంలో గొడవలు, కలహాలు మొదలవడంతో 2017 తన భార్యతో విడిపోయారు అర్బాజ్ ఖాన్.


అలా ఆరేళ్ల పాటు ఒంటరిగా ఉంటూ మరొక నటి(ఘరా ఖాన్)తో ప్రేమలో పడి 2023 డిసెంబర్లో రెండవసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు 58 ఏళ్ల వయసులో మరొకసారి తండ్రి అయ్యారు.. నిన్నటి రోజున ఘరా ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన అర్బాజ్ ఖాన్ సోదరుడు సల్మాన్ ఖాన్ ఆసుపత్రికి వెళ్లి వచ్చినట్లుగా బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసి అటు అభిమానులు కూడా అర్బాజ్ ఖాన్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


అర్బాజ్ ఖాన్ హలో బ్రదర్, దబాంగ్, తేరే ఇంతేజార్, దబాంగ్ 2, తదితర చిత్రాలలో నటించారు తెలుగులో అయితే చిరంజీవి నటించిన జై చిరంజీవి చిత్రంలో విలన్ గా నటించారు. అలాగే కిట్టు ఉన్నాడు జాగ్రత్త, శివం భజే వంటి చిత్రాలలో కూడా నటించారు. మలైకా విషయానికి వస్తే 2016లో ప్రముఖ నటుడు అర్జున్ కపూర్ తో ప్రేమలో ఉన్నట్లు వినిపించాయి కానీ 2024లో వీరిద్దరూ విడిపోయినట్లుగా కూడా బాలీవుడ్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. 2025లో మలైక మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సోదరుడికి సంబంధించి ఈ విషయం అయితే వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: