
అలాగే ఈ చిత్రంలోని సినిమాల్లోకి కూడా రాబోతున్నట్లు తన నిర్మాణ సంస్థలో రాబోతున్న .. రెండవ ప్రాజెక్ట్ గా మా ఇంటి బంగారం రాబోతున్నట్లు వెల్లడించింది . లేడీ ఓరియంట్ మూవీగా రాబోతున్న ఇందులో సమంత పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం . ఇక ఈ విషయాన్ని తెలుపుతూ ఫస్ట్ లుక్ ను కూడా షేర్ చేసింది సమంత . కానీ ఇన్ని రోజులు అవుతున్న ఎటువంటి అప్డేట్ ఇవ్వడం లేదు. దీంతో ఆమె ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తుందా లేదా రెండో పెళ్లి చేసుకుని సెటిల్ కానుందా అనే అనుమానాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి .
ఈ నేపథ్యంలోనే తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన సమంతలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది . ఈ క్రమంలోనే ఓ ప్రేక్షకుడు.. " మా ఇంటి బంగారం అప్డేట్ గురించి చెప్పండి " అని అడగగా దానికి సమంత.. " మీరందరూ అనుమానాలకు నేను సమాధానం ఇవ్వబోతున్నాను . ఈ నెలలోనే మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది . చాలా సంతోషంగా ఉంది . ఇన్నాళ్లు రీ ఎంట్రీ గురించి అడుగుతున్నా ప్రశ్నలకు ఈ మూవీతో మీ ముందుకు వచ్చి సమాధానం ఇవ్వబోతున్నాను " అంటూ వెల్లడించింది . దీంతో ఈ విషయం తెలుసుకున్న సమంత అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు .