
అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి తానని షారుక్ ఖాన్ తో పోల్చుకుంటూ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న కంగనా రనౌత్.. నేను ఇంత పెద్ద విజయాన్ని ఎలా సాధించానని ఆలోచించకండి.. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి ఇంత గొప్ప విజయాన్ని సాధించిన వారు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరూ లేరని.. షారుక్ ఖాన్ వంటి హీరోలు ఢిల్లీ నుంచి వచ్చినప్పటికీ ఆయన విద్యను కాన్వెంట్లో అభ్యసించారని, తాను గ్రామం నుంచి వచ్చాను ఆ ఊరి పేరు కూడా ఎవరికీ తెలియదంటూ ఆమె వ్యాఖ్యానించింది.
కంగనా మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్ లోని బమ్లా అనే గ్రామం నుంచి వచ్చి ఇంత పెద్ద విజయాన్ని సాధించడం గర్వకారణమని అందుకే బహుశా కొంతమందికి తన మాటలు అంగీకరించలేకపోవచ్చు.. నా మాటలు, చేతలు ఎప్పుడూ నిజాయితీగానే ఉంటాయని తాను అన్నిటికీ నిజాయితీగానే సమాధానాన్ని ఇస్తానని తెలిపింది. నటిని కావాలని ఉద్దేశంతోనే టీనేజ్ లో ఇంటి నుంచి వదిలి ముంబైకి వచ్చాను ఎన్నో కష్టాలను ఎదుర్కొని మరి ఇలాంటి విజయాన్ని సాధించానని తెలిపింది. కంగనా రనౌత్ కుటుంబం బమ్లాలో జమీందారి కుటుంబ నేపథ్యం కలదు.
ఇక షారుఖ్ ఖాన్ ఢిల్లీ ప్రాంతానికి చెందినవారు. ఈయన తాత ప్రభుత్వ ఉద్యోగి, తండ్రి హోటల్ బిజినెస్ చేసేవారు. షారుక్ ఖాన్ 1991లో సీరియల్ నటుడుగా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మారి సరికొత్త చరిత్రను సృష్టించారు. ఇప్పుడు ఆసియాలోనే నెంబర్ వన్ హీరోగా పేరు సంపాదించారు.