సినిమా ఇండస్ట్రీ లో తమ అభిమాన హీరోతో నటించే అవకాశం వచ్చినట్లయితే కొంత మంది నటీ మణులు ఎంతో ఆనంద పడుతూ ఉంటారు. ఇక అలాంటి అవకాశం వచ్చింది అంటే ఆ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు ..? ఆ మూవీ ని ఎవరు నిర్మిస్తున్నారు ..? ఆ మూవీజోనర్ లో రూపొందబోతుంది ..? ఆ సినిమా కథ ఏమిటి ..? ఇలాంటివి కూడా తెలుసుకోకుండా కేవలం తమ అభిమాన హీరో సినిమాలో ఆఫర్ వచ్చింది అని ఆ సినిమాలో నటిస్తూ ఉంటారు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మంచి క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో రాశి ఖన్నా ఒకరు.

ఈమె చాలా కాలం క్రితం నటిగా కేరిర్ను మొదలు పెట్టి ఇప్పటికి కూడా అద్భుతమైన రీతిలో కెరీర్ను ముందుకు సాగిస్తోంది. తాజాగా ఈమె తెలుసు కదా అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ మూవీ కి మంచి టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఓ హీరో పై ఉన్న అభిమానంతో సినిమా కథ కూడా వినకుండా ఆ మూవీ లో నటిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇంతకు ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు ... టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

తాజాగా రాశి ఖన్నా ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... నేను ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందే సినిమాలో నటించాలి అని అనుకుంటున్నాను. ప్రస్తుతం నేను పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో నటిస్తున్నాను. హరీష్ శంకర్ గారు నాకు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో ఆఫర్ ఇచ్చినప్పుడు నేను ఎంతో ఆనంద పడ్డాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో సినిమా కథ కూడా వినకుండా ఆ మూవీ కి ఓకే చెప్పాను అని ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: