టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ సమంత - అక్కినేని ఫ్యామిలీ హీరో నాగచైతన్య ప్రేమ పెళ్లి విడాకులు పెద్ద సంచలనం అయ్యాయి. సమంత నాగచైతన్య తో తన తొలి సినిమామాయ చేసావే లో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాతో ఇద్దరు మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాదాపు ఐదారు సంవత్సరాలు ఎంతో ఇష్టంగా ప్రేమించుకున్న ఈ జంట 2017లో పెళ్లి చేసుకున్నారు. ఈ మధ్యలో సమంత - నాగచైతన్య కాంబినేషన్లో ఏ మాయ చేసావే సినిమాతో పాటు ఆటోనగర్ సూర్య - మనం సినిమాలు వచ్చాయి. వీరిద్దరూ పెళ్లి తర్వాత కలిసి మజిలీ సినిమా లో నూ నటించారు. పెళ్లి తర్వాత కూడా సమంత - నాగచైతన్య కాంబినేషన్లో సినిమాలు తీసేందుకు ఆసక్తితో ఉన్నారు. ఇదే టైంలో అనుకోకుండా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోవడం చివరకు విడాకులు తీసుకోవడం చకచకా జరిగిపోయాయి.


నాగచైతన్య కు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత బాలీవుడ్ దర్శకుడు నిడిమోరు తో డేటింగ్ లో ఉన్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత ఇచ్చేలా ఇద్దరు కలిసి కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా కలిసి చెక్కర్లు కొడుతున్నారు. ఫంక్ష‌న్ లు .. సినిమా ఫంక్ష‌న్ లు ... అటు ముంబై లోనూ .. ఇటు హైద‌రాబాద్ లోనూ క‌లిసే మీడియాకు ప‌లుమార్లు క‌నిపిస్తున్నారు. సమంత కూడా రాజ్‌ దర్శకత్వంలో వెబ్ సిరీస్ ల‌లో నటిస్తోంది. తాజాగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు .. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని ప్రచారానికి మరింత ప్రాధాన్యం ఇచ్చేలా ఇద్దరు కలిసి దీపావళి పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. 


రాజ్ నిడిమోరు కుటుంబంతో కలిసి సమత దిగిన దీపావళి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాణాసంచా కాలుస్తున్న ఫోటోలను షేర్ చేసిన సమంత నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది అని కామెంట్ పెట్టారు. తరచూ సమంత - రాజ్‌ కలిసి కనిపిస్తూ ఉండడంతో ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: