గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకున్న బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.

శివ రాజ్ కుమార్ , జగపతి బాబు , దివ్యాందు ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ దర్శకుడు అయినటువంటి బుచ్చిబాబు విలేకరులతో ముచ్చటించాడు. అందులో భాగంగా ఈ సినిమా విడుదలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ను ఆయన తెలియజేశాడు. తాజాగా బుచ్చిబాబు మాట్లాడుతూ ... పెద్ది సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయాలి అనుకున్నాము.

అది చరణ్ పుట్టిన రోజు. కానీ ఆ దాని కంటే ఒక రోజు ముందు అనగా మార్చి 26 వ తేదీన శ్రీరామ నవమి అవుతుంది. దానితో ఆ సినిమాను ఆ రోజు విడుదల చేయాలి అని మేము ప్రయత్నిస్తున్నాము అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే మార్చి 26 వ తేదీన నాని హీరోగా రూపొందుతున్న ది ప్యారడైజ్ మూవీ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఒక వేళ పెద్ది సినిమాను మార్చి 26 వ తేదీన విడుదల చేసినట్లయితే  ది ప్యారడైజ్ మూవీ కి చాలా కష్టం అవుతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: