నాచురల్ స్టార్ నాని మరి కొంత కాలం లోనే సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం మన అందరికి తెలిసిందే. ప్రస్తుతం సుజిత్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో అత్యంత బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. నాని సినిమా కోసం సుజిత్ తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... నాని , సుజిత్ కాంబోలో రూపొందబోయే సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ పూజా హెగ్డే ను హీరోయిన్ గా పిక్స్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ప్రస్తుతం పూజ హెగ్డే తో ఈ మూవీ బృందం వారు సంప్రదింపులు జరుపుతున్నట్లు , ఇప్పటికే ఆల్మోస్ట్ ఈ బ్యూటీ నాని , సుజిత్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. పూజా హెగ్డే హీరోయిన్గా కెరియర్ను మొదలు పెట్టి చాలా కాలమే అవుతుంది. ఈమె కెరియర్ను మొదలు పెట్టిన కొత్తలోనే మంచి విజయాలను అందుకొని ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఎన్నో తమిళ సినిమాలలో నటించి అక్కడ కూడా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ హిందీ లో కూడా చాలా సినిమాల్లో నటించి అక్కడ కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇలా అద్భుతమైన క్రేజ్ ను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మకు ఈ మధ్య కాలంలో మాత్రం వరుస పెట్టి భారీ అపజయాలు దక్కుతున్నాయి.

ఈమెకు మంచి విజయం దక్కి ఇప్పటికే చాలా కాలమే అవుతుంది. ఇలా ఈ మధ్య కాలంలో ఈమెకు వరుస పెట్టి భారీ ప్లాప్స్ దక్కుతున్నప్పటికి నాని , సుజిత్ కాంబోలో రూపొందబోయే సినిమాతో ఈమెకు అద్భుతమైన విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతుంది అని పూజా హెగ్డే ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సుజిత్ తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజి సినిమాకు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: