
రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన, తన మొదటి సినిమాతోనే మంచి ఇంప్రెషన్ కలిగించాడు. ఆ తర్వాత "మగధీర", "రంగస్థలం", "ఆర్ ఆర్ ఆర్ " వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రపంచ స్థాయి గుర్తింపును సంపాదించాడు. గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కూడా ఇప్పుడు ఆయన పేరుతో కలిసిపోయింది. అయితే, ఈ మధ్య రామ్ చరణ్ సినిమాల స్పీడ్ కొంచెం తగ్గిందనే కామెంట్స్ వస్తున్నాయి. ఒక్కో సినిమాకి రెండు మూడు సంవత్సరాలు సమయం తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన అనిల్ రావి పూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్‌లో ఉన్నాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు, కానీ ఆ తర్వాత ప్రాజెక్ట్‌ల గురించి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఇదే సమయంలో చిరంజీవి మాత్రం వయస్సు 70 దాటుతున్నా కూడా తన ఎనర్జీ తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రో కమర్షియల్ ఎంటర్టైనర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే శ్రీకాంత్ ఓదెల, బాబీ, వెంకీ కుడుముల వంటి డైరెక్టర్లతో వరుసగా ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉంచేశారు. అంటే చిరంజీవి షెడ్యూల్ పూర్తిగా ఫుల్‌గా ఉంది. దాదాపు ఐదు ఏళ్లకి సంబంధించిన కమిట్‌మెంట్‌లు ఇప్పటికే ఫిక్స్ అయిపోయాయి. ఈ ఎనర్జీ, ఈ డెడికేషన్ చూస్తే చాలామంది అభిమానులు “ఇంత వయస్సులో కూడా చిరంజీవి ఇలా కష్టపడుతున్నారు, కానీ చరణ్ మాత్రం నెమ్మదిగా వెళ్తున్నాడు” అంటూ పోలికలు మొదలుపెట్టారు.
దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. కొంతమంది ట్రోలర్స్ “చరణ్ - చిరంజీవి లెవల్‌కి రావాలంటే ఇంకా చాలా దూరం” అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరోవైపు కొంతమంది మెగా అభిమానులు మాత్రం దీనికి కౌంటర్ ఇస్తూ, “ప్రతి హీరోకి తనకంటూ ఒక స్పీడ్, ఒక ప్లానింగ్ ఉంటుంది. అంటూ ఆయనను సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా, ఈ పోలిక ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో బాగా ట్రెండ్ అవుతోంది. కానీ ఒక విషయం మాత్రం ఫిక్స్ — మెగాస్టార్ చిరంజీవి లెజెండ్ స్థాయి రీచ్ చేయడం ఎవరికైనా చాలా టఫ్ టాస్క్ అనే మాటకు ఎవ్వరూ వ్యతిరేకంగా మాట్లాడలేరు.