టాలీవుడ్ యువ దర్శకుడు సుజిత్ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓజి అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో పవన్ కి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటించగా ... ఈ సినిమా సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. ఈ మూవీ విడుదల అయిన తర్వాత సుజిత్ మరియు ఓజి మూవీ ని నిర్మించిన దానయ్య కు సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఓజి మూవీ నిర్మాత అయినటువంటి దానయ్య ఈ సినిమా చివరి దశకు చేరే సమయానికి ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నట్లు , దానితో సినిమా చేయలేని పరిస్థితికి వచ్చినట్లు , ఇక సినిమా ఆపివేయడం ఇష్టం లేని సుజిత్ తన సొంత డబ్బు ఆరు కోట్లు పెట్టి ఈ సినిమా మిగిలిన భాగం షూటింగు ను పూర్తి చేసినట్లు , ఆ తర్వాత ఆ లెక్కల విషయంలో సుజిత్ , దానయ్య మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అలాగే సుజిత్ , నాని దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేయనున్నాడు. ఓజి సినిమా చిత్రీకరణ దశలో ఉన్న సమయంలో నాని , సుజిత్ కాంబో మూవీ ని కూడా దానయ్య నిర్మించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఈ కాంబో మూవీ చేతులు మారింది.

వేరే నిర్మాత ఈ సినిమాను చిత్రీకరించబోతున్నాడు. దానితో ఓజి మూవీ విభేదాల వల్లే సుజిత్ , దానయ్య బ్యానర్లో కాకుండా నాని సినిమాను వేరే బ్యానర్లో చేస్తున్నారు అని వార్తలు పెరిగిపోయాయి. తాజాగా సుజిత్ ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. సుజిత్ తాజాగా మాట్లాడుతూ ... ఓజి సినిమా ఒక అద్భుతమైన మూవీ. ఆ సినిమా విషయంలో నాకు అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. ముఖ్యంగా దానయ్య గారు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఆయన లేకుంటే సినిమా మీ ముందుకు వచ్చేది కాదు అని సుజిత్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: