టాలీవుడ్ ,కోలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్స్ శృతిహాసన్. సినిమాలలో కంటే తన లవ్ బ్రేకప్ లో విషయంలోనే ఇమే పేరు నిరంతరం వినిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో శృతిహాసన్ ఎంచుకున్న పాత్రలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ ఏడాది వచ్చిన కూలి సినిమాలో నటించిన శృతిహాసన్ ఈమె పాత్ర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఈమె కంటే పూజా హెగ్డే కి భారీ హైప్ ఏర్పడినట్లు వినిపిస్తున్నాయి. శృతిహాసన్ కీలక పాత్రలో నటించిన క్రేజ్ రాలేదు. కేవలం మోనిక సాంగ్ తో పూజా హెగ్డే కి భారీ క్రేజ్ పెరిగింది.


ఇక కూలి సినిమా ఆయన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుందా అంటే తమిళ్ ఆడియన్స్ కే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో రూ .500 కోట్ల క్లబ్ లో చేరడం కూడా కష్టమైంది. కూలి సినిమా వల్ల శృతిహాసన్ కెరియర్ ఎక్కడికో వెళ్తుందంటూ సినిమా విడుదల ముందు భారీ హైప్ ఏర్పడిన విడుదల తర్వాత మాత్రం ఏ ఒక్క సినిమాలో కూడా ఈమెకు నటించే అవకాశాలు కాని , కథలు వింటున్నట్టుగా ఎక్కడ వార్తలు వినిపించలేదు. డెకాయిట్ సినిమాలో నటించిన కొన్ని కారణాల చేత సినిమాని వదిలేసింది.


తమిళంలో డైరెక్టర్ మీస్కిన్ దర్శకత్వంలో ట్రైన్ అనే సినిమాలో నటించింది. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయిన విడుదల మాత్రం కాలేదు. ప్రభాస్ సలార్ 2 సినిమాలో కూడా ఉన్న మాటే వాస్తవమే కానీ ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియడం లేదు. హాలీవుడ్ మూవీ దిఐ చిత్రం కూడా 2023 లోని పూర్తికాగా, ఈ చిత్రం గ్రీక్ ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్, లండన్ ఇండిపెండెన్స్ ఫీలింగ్ ఫెస్టివల్ ప్రసారమై మంచి ప్రశంసలు అందుకుంది. కానీ ఈ సినిమా థియేటర్లోకి విడుదల కాలేదు.దీన్ని బట్టి చూస్తూ ఉంటే శృతిహాసన్ కెరియర్ ప్రస్తుతం డైలమాలో పడినట్టుగా కనిపిస్తోంది. శృతిహాసన్ కూడా తన రూట్ ని మార్చుకోకపోతే కెరియర్ కష్టమే అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: