పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే జనసేన అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలకు దూరంగా ఉంటాను. కేవలం రాజకీయాలపై దృష్టి పెట్టి ప్రజలకు సేవ చేస్తూ ఉంటాను అని ప్రకటించాడు. అలా ప్రకటించిన తర్వాత ఆయన అభిమానులు కనీసం ఎప్పుడో ఒక సినిమా అయినా చేసి మమ్మల్ని ఆనంద పరచండి అని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా తన అభిమానుల కోరిక మేరకు సినిమాలు చేయడానికి ఒప్పుకున్నాడు. అందులో భాగంగా రాజకీయాలపై పెద్ద ఎత్తున సమయాన్ని కేటాయించిన వీరు దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్లలో పాల్గొంటూ కొన్ని సినిమాలను పూర్తి చేస్తూ వచ్చాడు. పవన్ కళ్యాణ్ పార్టీ అయినటువంటి జనసేన కొంత కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మంచి విజయాన్ని సాధించింది. దానితో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నాడు. పవన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గా ఉండడంతో ఆయన ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసి ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటాడు అని చాలా మంది అనుకున్నారు. తాజాగా పవన్ నటించిన ఓజి సినిమా థియేటర్లలో విడుదల అద్భుతమైన విజయాన్ని సాధించింది. పవన్ నటించిన ఉస్తాది భగత్ సింగ్ మూవీ ఒకటి విడుదలకు రెడీగా ఉంది.

సినిమా తర్వాత పవన్ మొత్తంగా సినిమాలకు దూరంగా ఉంటాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ పవన్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాలోనూ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో మూవీలోనూ నటించే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. దీనితో చాలా మంది ఓజి మూవీ సూపర్ సక్సెస్ కావడంతో పవన్ రాజకీయాలపై , సినిమాపై రెండింటిపై దృష్టి పెట్టాలి అని అని అనుకుంటున్నాడు కావచ్చు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: