
ఈ ఫోటోలలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు స్టార్ హీరోయిన్స్ శృతి హాసన్. తన నటనతో అందంతో ఎన్నో చిత్రాలలో నటించి భారీ విజయాలను అందుకున్న శృతిహాసన్ ఆ మధ్యలో కొన్నేళ్లు గ్యాప్ ఇచ్చి మళ్లీ బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలలో నటిస్తోంది. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను కూడా నిరంతరం షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవలే కూలి చిత్రంలో నటించిన శృతిహాసన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
తాజాగా శృతిహాసన్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసింది. ఇందులో మొత్తం మూడు ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలకు ఆమె ఆసక్తికరమైన క్యాప్షన్ ని జోడి చేసింది. మొదట దోశ ఫోటోని షేర్ చేయగా.. ఆ ఫోటోకు దోశ లైఫ్ అన్నట్లుగా క్యాప్షన్ ఇచ్చింది, ఆ తర్వాత మేకప్ రూమ్ లో వర్కింగ్ మూడంటూ మరొక డిఫరెంట్ లుక్ ఫోటోని షేర్ చేయగా అలాగే మరొకటి వెరైటీ ఎక్స్ప్రెషన్స్ తో ఫోటోను పంచుకుంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలు తన మీద వచ్చే ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ కి షేర్ చేసినట్లుగా వినిపిస్తున్నాయి.