బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రోజురోజుకి ఉత్కంఠ పెరిగిపోయేలా చేస్తున్నాయి. అధికార పార్టీ ,ప్రతిపక్ష పార్టీల మధ్య పోటాపోటీ గానే ప్రచారం చేస్తున్నారు. ఇటీవల నామినేషన్ ప్రక్రియలో తాజాగా అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీ తరఫున ససారం నియోజవర్గ అభ్యర్థి సత్యేంద్ర షాకు తాజాగా షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన వెంటనే పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన ఈ వివరాల ప్రకారం సుమారుగా 21 సంవత్సరాల క్రితం నమోదైన ఒక పాత కేసులో ఈయన చిక్కుకున్నట్లు తెలియజేశారు.


ఈ కేసులో తాజాగా కోర్టు నుంచి జారీ అయిన నాన్- బెయిలబుల్ వారంటీ ఆధారంగా ఝార్ఖండ్ పోలీసులు ఈ అభ్యర్థిని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా సత్యేంద్రషాను జైలుకు పంపించారు. 2004 లో జార్ఖండ్ లోని గర్హ్వా పోలీస్ స్టేషన్లో ఈ అభ్యర్థి పైన ఒక కేసు నమోదు అయింది. ఈ కేసులో భాగంగా అక్టోబర్ 20, 2025 న నామినేషన్ దాఖలు చేసిన అనంతరం సత్యేంద్ర షాను బయటికి రాగానే, పోలీసులు అతని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఎన్నికల సమయంలో తమ అభ్యర్థిని అరెస్టు చేయడంపై RJD పార్టీతో పాటు,మహాకూటమి నాయకులు ఫైర్ అవుతున్నారు.


ఇది తమ ప్రత్యర్థులు చేసిన రాజకీయ కుట్రని ఉద్దేశపూర్వకంగానే ఆర్జేడి నేతను అరెస్టు చేశారంటు పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు RJD నేతలు. కోర్టు వారంట్ ఉన్నప్పటికీ ఎన్నికల ముందు తనని అరెస్టు చేయలేదని, కానీ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నుంచి ఎప్పుడైతే తను అభ్యర్థిగా నామినేషన్ వేసానో అప్పుడే తన ప్రత్యర్థుల కుట్ర పన్ని తనని అరెస్టు చేయించేలా చేశారంటూ సత్యేంద్ర షా తెలిపారు. అనంతరం తన బదులుగా ప్రజలే ఎన్నికలలో పోటీ చేస్తారని నేను ససారం ప్రజల ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను అంటూ తెలియజేశారు. ఈ విషయం అనంతరం ఆయన మద్దతుదారులు కూడా ఈ విషయం పైన తీవ్రమైన ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. బీహార్ ఎన్నికలలో కూటమి అభ్యర్థి అరెస్టు కావడం ఇది మూడవసారి. సత్యేంద్ర అరెస్టుతో బీహార్ రాజకీయాల వాతావరణ ఒక్కసారిగా వేడెక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: