కే ర్యాంప్ నిర్మాత రాజేష్ దండా మాట్లాడిన మాటలు మీడియాలో దుమారం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా సమాచారాన్ని చేరవేసే ప్రధానాస్త్రం మీడియానే. అలాంటి మీడియా పైనే ఆయన దుమ్మెత్తి పోశారు.అయితే మొత్తం మీడియాని ఆయన టార్గెట్ చేయలేదు. కేవలం ఒక వెబ్సైట్ ని మాత్రమే ఆయన టార్గెట్ చేసి మాట్లాడారు. లు నా కొడుకులు..మా సినిమాలతో బతికే బతుకులు అవి అంటూ ఆ వెబ్సైట్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. తెలుగు 360 అనే వెబ్సైట్ పేరుని ప్రస్తావిస్తూ నిర్మాత ఈ కామెంట్లు చేశారు. మా సినిమాకి తక్కువ రేటింగ్ ఇచ్చి డ్యూడ్ సినిమాకి ఎక్కువ రేటింగ్ ఇచ్చారు. డ్యూడ్ సినిమా తమిళ, తెలుగు రెండు ఇండస్ట్రీలని కలిపి లెక్కలు బయటపెట్టారు. కానీ మాది కేవలం తెలుగు లెక్కలు మాత్రమే బయటపెట్టారు.కానీ డ్యూడ్ మూవీకి రెండింటివి కలిపి లెక్కలు రాసారు. అమెరికాలో ఉండే వాడికి చెబుతున్నా.. ఒరేయ్ లు నా కొడకా..నీకేం తెలుసురా సినిమాల గురించి.నువ్వు మగాడివైతే మా సినిమాని తొక్కు చూస్తా.. 

వీడు ఓ హిట్ సినిమాని తొక్కేయాలని చూస్తున్నాడు.ఈ నా కొడుకుని నడి రోడ్డు మీద గుడ్డలూడదీసి ఉరి తీయాలి..మా సినిమాల మీద బతికే నా కొడకా అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు రాజేష్ దండా. అయితే ఈయన వ్యాఖ్యలను సౌత్ ఇండియా డిజిటల్ పబ్లిషర్స్ అసోసియేషన్ ఖండించింది. తమ అసోసియేషన్ లో అన్ని డిజిటల్ సంస్థలు భాగమై ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యల్ని మేము ఖండిస్తున్నాము. ఏవైనా వృత్తిపరమైన డిఫరెన్సెస్ ఉంటే గౌరవ మర్యాదలతో వాటిని తెలపాలి. కానీ ఇలా బహిరంగంగా పబ్లిక్ లో అసభ్యకర మాటలు మాట్లాడడం, గౌరవానికి భంగం కలిగించేలా  మాట్లాడకూడదు. 

ఒకరి గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడడం వైలెన్స్ సృష్టించడం చట్ట ప్రకారం నేరం క్రిమినల్ ఎఫెన్స్ అవుతుంది. జర్నలిస్టులను అవమానించేలా మాట్లాడినా.. వారి గౌరవానికి భంగం కలిగించినా.. అసభ్యంగా మాట్లాడినా, మీడియా హౌస్ లను టార్గెట్ చేసి మాట్లాడినా మేం చూస్తూ ఊరుకోం. పత్రికా స్వేచ్ఛ కోసం మేము ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్తాం చూస్తూ కూర్చోం అంటూ ఓ లెటర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ లేఖ మీడియాలో వైరల్ గా మారింది.మరి డిజిటల్ పబ్లిషింగ్ సంస్థలు రిలీజ్ చేసినా లేఖపై రాజేష్ దండా ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: