టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయిలో హీరోయిన్గా సక్సెస్ అయిన వారిలో ఎంతో మంది హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. కొంత మంది టాలీవుడ్ లో అద్భుతమైన స్థాయికి ఎదిగిన తర్వాత హిందీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టి తెలుగు సినిమాల్లోనే నటించకుండా కేవలం హిందీ సినిమాల పైనే ఫోకస్ పెట్టిన వారు కూడా ఉన్నారు. కానీ అలా తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత హిందీ సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో అత్యంత తక్కువ మంది మాత్రమే బాలీవుడ్ ఇండస్ట్రీ లో సక్సెస్ అయ్యారు. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న బ్యూటీ లలో తాప్సి ఒకరు. తాప్సి బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇకపోతే తెలుగు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును  సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో ఇలియానా , రకుల్ ప్రీత్ సింగ్ మరి కొంత మంది కూడా ఉన్నారు. ఇలియానా , రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం  బాలీవుడ్ ఇండస్ట్రీ లో తాప్సి స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకోలేదు. తాప్సి రేంజ్ లో ఇలియానా , రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో సక్సెస్ కాకపోవడానికి కారణం తాప్సి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలలో నటించడం కంటే కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో, తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో , వైవిధ్యమైన సినిమాలలో సినిమాలలో నటించడం పై ఎక్కువ ఫోకస్ పెట్టి సక్సెస్ అయ్యింది. కానీ ఇలియానా , రకుల్ ప్రీత్ సింగ్ కమర్షియల్ సినిమాలలో నటించడంపై ఎక్కువ ఆసక్తిని పెట్టారు. అందుకే వారు తాప్సి స్థాయిలో సక్సెస్ కాలేదు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: