కిరణ్ అబ్బవరం కొంత కాలం క్రితం క అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత దిల్ రుబా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ మాత్రం బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తాజాగా కిరణ్ "కే ర్యాంప్" అనే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి మంచి టాక్ ను తెచ్చుకొంది. దానితో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కూడా కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ను అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఏడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఏడు రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి ..? ఇప్పటివరకు ఈ సినిమాకు ఎన్ని లాభాలు వచ్చాయి ..? అనే వివరాలను తెలుసుకుందాం.

ఏడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 2.74 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 1.21 కోట్లు , ఆంధ్ర లో 3.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏడు రోజుల్లో ఈ సినిమాకు 7.25 కోట్ల షేర్ ... 12.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఏడు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 87 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 97 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 9.09 కోట్ల షేర్ ... 16.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 8.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటికే ఈ సినిమా ఫార్ములా ను కంప్లీట్ చేసుకొని 9 లక్షల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: