సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన సినిమాలలో అవకాశాలు రావాలి అన్న , స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగాలి అన్న అందం , అభినయం తో పాటు అదిరిపోయే రేంజ్ విజయాలు కూడా ముఖ్యం అనే వాదనను అనేక మంది అనేక సందర్భాలలో వినిపిస్తూ వస్తుంటారు. ఇకపోతే అందం , అభినయం ఉన్నా కూడా సరైన విజయాలు లేకపోవడంతో ఓ ముద్దుగుమ్మ కెరియర్ను గొప్ప స్థాయిలో కొనసాగించడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. మరి అందం , అభినయం ఉన్న విజయాలు మాత్రమే లేకపోవడంతో మంచి సినిమా అవకాశాలను అందుకోలేకపోతున్న ఆ ముద్దుగుమ్మ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమనులలో ఒకరు అయినటువంటి కావ్య ధాపర్. ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు అనేక తెలుగు సినిమాలలో నటించింది.

ఈమె నటించిన సినిమాలలో ఈమె తన నటన కంటే కూడా అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా ఈమె తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటు రావడంతో ఈమెకు కెరియర్ ప్రారంభంలో మంచి సినిమాలలో అవకాశాలు దక్కాయి. కానీ ఈమెకు మంచి విజయాలు మాత్రం దక్కలేదు. దానితో మెల్లి మెల్లిగా ఈమెకు అవకాశాలు కూడా తగ్గాయి. కొంత కాలం క్రితం ఈమె గోపీచంద్ హీరో గా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన విశ్వం అనే మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ అయిన విజయం సాధిస్తే ఈ బ్యూటీ కెరియర్ టర్న్ అవుద్ది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. ఇక ఈమె అందంతో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటున్న కూడా సరైన విజయాలు లేకపోవడంతోనే ఈమెకు భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు రావడం లేదు అని , ఈమెకు ఒక్క బ్లాక్ బాస్టర్ హిట్టు పడినట్లయితే ఒక్క సారిగా ఈమె స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతుంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: