కానీ, ఆ అభిమాని మాట్లాడటానికి ముందుకు రాగానే గంగై అమరన్ తక్షణమే పక్కకు జరిగి, “ఎవరైనా మాట్లాడుతుంటే వెనక ఇలా నిలబడతారా? ఇది మానర్స్ కాదు” అంటూ కోపంగా మందలించారు. ఈ అనుకోని ప్రతిస్పందనతో ఆ అభిమాని కంగారు పడి, అవమానానికి గురై నిశ్శబ్దంగా అక్కడి నుండి వెనక్కి వెళ్లిపోయాడు. అక్కడ ఉన్నవారు, మీడియా ప్రతినిధులు ఈ ఘటనను చూసి ఆశ్చర్యపోయారు. కొద్ది సమయానికే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో గంగై అమరన్ ప్రవర్తన చూసి అనేకమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇంత పెద్ద వ్యక్తి అయిన గంగై అమరన్ అభిమానుల పట్ల ఇంత అహంకారంగా ప్రవర్తించడం సరికాదు” అంటూ చాలామంది విమర్శిస్తున్నారు. మరికొందరు “తనకు పేరు, గౌరవం ఇచ్చింది అభిమానులే. వాళ్లను అవమానించడం ఎంత వరకు న్యాయం?” అని ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో గంగై అమరన్‌పై వేల సంఖ్యలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది యూజర్లు ఘాటుగా స్పందిస్తూ, “కడుపుకి తినేది అన్నమేగా, అహంకారం ఎందుకు?” అంటూ వ్యంగ్యంగా రాస్తున్నారు. మరికొందరు ఆయన వెంటనే ఆ అభిమానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతలో గంగై అమరన్ అభిమాన వర్గం మాత్రం ఆయనను సమర్థిస్తూ, “అది ఉద్దేశపూర్వకంగా చేసిన అవమానం కాదు, కేవలం సరదాగా అన్న మాటను తప్పుగా అర్థం చేసుకున్నారు” అని చెబుతున్నారు. అయితే సాధారణ ప్రేక్షకులు మాత్రం “అభిమానులను గౌరవించడం ప్రతి కళాకారుడి బాధ్యత. వాళ్లే మనలను ఈ స్థాయికి తీసుకొచ్చారు” అంటూ గుర్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి