సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కెరియర్ బిగినింగ్లో అనేక కష్టాలను ఎదుర్కొని ఆ తర్వాత మాత్రం మంచి విజయాలను అందుకొని అద్భుతమైన స్థాయికి చేరుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె కెరియర్ బిగినింగ్ లో అనేక కష్టాలను ఎదుర్కొంది. ఆ తర్వాత ఈమె ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. అలాగే అనేక తమిళ్ , హిందీ సినిమాలలో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఈమె సందీప్ కిషన్ హీరో గా రూపొందిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం , ఈ మూవీ లో ఈమె తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు అనేక సినిమా ఆఫర్లు వచ్చాయి. అందులో ఈమె నటించిన సినిమాలు చాలానే మంచి విజయాలు సాధించడంతో ఈమె తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

ఈమె వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా కంటే ముందే ఓ తెలుగు సినిమాను ఓకే చేసింది. ఆ మూవీ లోని ఈమెకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ను కూడా పూర్తి చేసి ఆ తర్వాత ఈమెను ఆ మూవీ నుండి తీసేసారట. ఇంతకు ఆ సినిమా ఏది అనుకుంటున్నారా ..? ఆ మూవీ మరేదో కాదు ప్రభాస్ హీరోగా రూపొందిన మిస్టర్ పర్ఫెక్ట్. ప్రభాస్ హీరోగా రూపొందిన మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీ లో కాజల్ అగర్వాల్ స్థానంలో మొదట రకుల్ ను తీసుకొని , ఐదు రోజుల షూటింగ్ పూర్తి అయ్యాక ఆమె ఆ పాత్రలో సెట్ కాదు అనే ఉద్దేశంతో ఆమెను ఆ సినిమా నుండి తీసేసారట. ఆ తర్వాత ఆ స్థానంలో కాజల్ ను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారట. ప్రభాస్ హీరోగా రూపొందిన మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ లో కాజల్ తో పాటు తాప్సి కూడా హీరోయిన్గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: