సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరో , దర్శకుడి కాంబోలో ఒక మూవీ వచ్చి మంచి విజయం సాధించినట్లయితే ఆ తర్వాత కూడా వారి కాంబో లో మరో సినిమా వస్తే బాగుంటుంది అని ప్రేక్షకులు అనుకోవడం సర్వసాధారణం. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి నాని కొన్ని సంవత్సరాల క్రితం పిల్ల జమిందార్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. జి అశోక్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో హరి ప్రియ , బిందు మాధవి హీరోయిన్లు గా నటించారు. ఈ మూవీ లో రావు రమేష్ , ఎమ్ ఎస్ నారాయణ ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ద్వారా నాని కి అశోక్ కి ఇద్దరికి కూడా అద్భుతమైన గుర్తింపు వచ్చింది.

అశోక్ "పిల్ల జమిందార్" సినిమా తర్వాత ఆది సాయి కుమార్ హీరో గా నిషా అగర్వాల్ హీరోయిన్గా సుకుమారుడు అనే సినిమాను రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయింది. ఈ మూవీ లో మొదట ఆది సాయి కుమార్ ను కాకుండా నాని ని హీరోగా తీసుకోవాలి అని ఈ మూవీ దర్శకుడు అయినటువంటి అశోక్ అనుకున్నాడట. అందులో భాగంగా నాని ని సంప్రదించి ఆ మూవీ కథను కూడా వివరించాడట. కానీ కొన్ని కారణాల సుకుమారుడు సినిమాలో నటించడానికి నాని ఒప్పుకోలేదట. అలా నాని తనకు పిల్ల జమిందార్ సినిమాతో అద్భుతమైన విజయం అందించిన అశోక్ దర్శకత్వంలో మరో సినిమా నటించడానికి ఒప్పుకోలేదట. ఏదేమైనా కూడా నాని , జి అశోక్ ఇద్దరికి కూడా పిల్ల జమిందార్ సినిమాతో అదిరిపోయే రేంజ్ గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: