సూపర్‌స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ — “SSMB-29”. ఈ చిత్రంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్, అడ్వెంచర్, భావోద్వేగాలతో నిండిన ఈ సినిమా పై ఇప్పటికే అపారమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుండి అభిమానులు ప్రతి రోజూ ఏదో ఒక అప్డేట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ, రాజమౌళి మాత్రం ఎప్పటిలాగే నిశ్శబ్దంగా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అందుకే అభిమానులు ఒక్క పోస్టర్ అయినా రిలీజ్ చేయమని సోషల్ మీడియాలో నిత్యం రిక్వెస్ట్ చేస్తున్నారు.


ఇంతలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక పెద్ద సర్ప్రైజ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. రాజమౌళి తన ట్విట్టర్ (ఎక్స్) ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఆయన పోస్ట్‌లో ఇలా రాశారు –“సినిమాలోని మూడు ప్రధాన పాత్రలతో ప్రస్తుతం మా క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. మరోవైపు గ్లోబల్ థియేట్రికల్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా ఈ ఈవెంట్ ఉండబోతోంది.నవంబర్ 15న మీరు ఈ ఈవెంట్‌ను చాలా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. నేను కూడా ఆ రోజు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అంతవరకు మీరు మరింత ఎగ్జైటెడ్‌గా ఉండేందుకు… ఈరోజు పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తున్నాం. సిద్ధంగా ఉండండి!”అని రాజమౌళి రాసుకొచ్చారు.



ఈ పోస్ట్ సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. ఎందుకంటే రాజమౌళి తన గత సినిమాల విషయంలో ఇంతగా పర్సనల్‌గా అప్‌డేట్ ఇవ్వడం చాలా అరుదు. కానీ “SSMB 29” కోసం మాత్రం ఆయన స్వయంగా ఫ్యాన్స్‌తో ఇలా నేరుగా కనెక్ట్ అవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.అంతేకాకుండా — “మీ ఆనందం కోసం పృథ్వీరాజ్ పోస్టర్ విడుదల చేస్తున్నాను” అని చెప్పడం ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని రేపింది. ఇప్పటికే ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆనందంతో షేర్ చేస్తూ, కామెంట్స్‌తో ముంచెత్తుతున్నారు. కొంతమంది అయితే —“రాజమౌళిలో ఈ యాంగిల్ కూడా ఉందా..? అసలు ఊహించలేదు!”అని కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద, రాజమౌళి నుండి వచ్చిన ఈ అప్‌డేట్ ఫ్యాన్స్‌కు పండగ వాతావరణం తీసుకొచ్చింది. నవంబర్ 15 వరకు ఉత్కంఠతో ఎదురుచూడడమే ఇప్పుడు అందరి టార్గెట్..!



మరింత సమాచారం తెలుసుకోండి: