కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ కొన్నాళ్లు ప్రేమలో ఉన్న అనంతరం 2021 డిసెంబర్ 9న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో సన్నిహిత బంధువులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఆ వివాహం బాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశంగా నిలిచింది. పెళ్లి తర్వాత కత్రినా సినిమాల సంఖ్యను తగ్గించి కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చింది. అయితే, అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 23న కత్రినా, విక్కీ కౌశల్ దంపతులు తమ తొలి సంతానం రాబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. ఆ ప్రకటనతోనే అభిమానులు ఆనందంతో మునిగిపోయారు. ఇప్పుడు ఆ ఆనందం నిజమైంది.
ప్రస్తుతం బాలీవుడ్, సోషల్ మీడియాలో ఒక్కటే సంబరం – “కత్రినా-విక్కీ తల్లిదండ్రులయ్యారు!” అంటూ అభిమానులు ఈ జంటపై ప్రేమ వర్షం కురిపిస్తున్నారు. సినీ ప్రపంచం నుంచి శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా పుట్టిన బాబు ఆరోగ్యంగా ఉన్నాడని కుటుంబ వర్గాలు వెల్లడించాయి. కత్రినా-విక్కీ కుటుంబంలోకి కొత్త వెలుగు, కొత్త జీవం, కొత్త సంతోషం ప్రవేశించింది. బాలీవుడ్‌లో హ్యాపీ మోమెంట్ ఇది! ఎప్పుడెప్పుడు కత్రీనా తన బేబీని చూపిస్తుందా..? అంటూ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి