కోలీవుడ్ గగనంలో రెండు ధ్రువతారలు. ఒకరు తల అజిత్ కుమార్, మరొకరు దళపతి విజయ్. ఈ ఇద్దరు దిగ్గజాల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో, బాక్సాఫీస్ వద్ద జరిగే పోటీని ఒక 'యుద్ధంస‌ లా చూసేవారు ప్రేక్షకులు. తరాలు మారినా, దశాబ్దాలు గడిచినా.. ఈ ఫ్యాన్ వార్ అనేది ఒక హాట్ టాపిక్‌గా, ట్రెండింగ్ సబ్జెక్ట్‌గా మారింది. ఈ అపరిమితమైన క్రేజ్, అంతులేని పోటీ నేపథ్యంలో, ఇద్దరు స్టార్ల మధ్య వ్యక్తిగతమైన వైరం ఉందంటూ ఎన్నో ఏళ్లుగా పుకార్లు, వదంతులు చుట్టుముట్టాయి. మీడియా ఎప్పుడూ ఆ కోణంలోనే వార్తలను ప్రసారం చేస్తూ, అభిమానుల మధ్య ఉన్న అగ్నిని రాజేసింది.


అయితే, ఎప్పుడూ తన పనితోనే సమాధానం చెప్పే మన 'విశ్వాసం' స్టార్ అజిత్ కుమార్.. ఈసారి నేరుగా రంగంలోకి దిగారు. తన మౌనాన్ని వీడి, ఒకే ఒక్క మాటతో దశాబ్దాల పుకార్లకు 'ఫుల్ స్టాప్' పెట్టారు! కోలీవుడ్ సినీ చరిత్రలో నిలిచిపోయేలా ఓ సంచలన ప్రకటన చేశారు. "విజయ్.. నా సోదరుడితో సమానం! మా మధ్య పోటీ లేదు. ఉన్నదల్లా స్నేహం, గౌరవం మాత్రమే. ఒకరి పనిని మరొకరు మెచ్చుకుంటాం. ఎవరి దారి వారిదే. అభిమానులు ఈ అనవసరపు వైరాన్ని ఆపేయండి," అంటూ అజిత్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు తమిళనాట కాదు, దక్షిణాది సినీ ప్రపంచంలోనే పెను తుఫాను సృష్టిస్తోంది!



ఈ వ్యాఖ్యలు కేవలం ఒక ప్రకటన కాదు, ఆయనలోని రాజసం, పరిణతికి నిదర్శనం. నిజమైన స్టార్ అంటే తెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా ఇలాగే ఉంటారని మరోసారి నిరూపించారు. అజిత్ ఈ మాట అన్న తరువాత, దళపతి విజయ్ అభిమానులు సైతం ఆనందంలో మునిగిపోయారు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఫ్యాన్ ఫైట్.. ఒక్క దెబ్బతో చల్లబడింది. 'తల-దళపతిస‌ ల మధ్య లేని వైరాన్ని సృష్టించి, మీడియా హైప్ చేసిన కథలకు అజిత్ ఇచ్చిన ఈ మాస్ కౌంటర్ అద్భుతం.



ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ ఇండస్ట్రీకి రెండు కళ్లు లాంటి వారు. వారిద్దరూ కలిసి ఉంటే, ఆ శక్తి ముందు ఏదీ నిలబడదు. అజిత్ కుమార్ ఇచ్చిన ఈ సందేశం.. ప్రతి అభిమాని గుండెల్లో ప్రతిధ్వనించాలి. ఇకపై సోషల్ మీడియాలో బూతులు, దూషణలు వద్దు! తల, దళపతి అభిమానులు అంతా ఒక్కటై, దక్షిణాది సినీ సామ్రాజ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలి. అజిత్ గర్జన పవర్! పోటీ కాదు, కలిసి నడవడమే నిజమైన గెలుపు! ఇది కదా మాస్ అంటే!

మరింత సమాచారం తెలుసుకోండి: