తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 సంబంధించి ఈవారం ఊహించని ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. గతవారం హౌస్ నుంచి దివ్వెల మాధురి ఎలిమినేట్ అవ్వగా ఈవారం ఏకంగా డబుల్ ఎలిమినేషన్ జరుగుతున్నట్లు వినిపిస్తోంది. ఇదంతా ఇలా ఉంటే నిన్నటి ఎపిసోడ్ లో ఒక ఊహించని సంఘటన జరిగింది. హౌస్ నుంచి రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్ అయినట్లుగా చూపించారు. హౌస్ లో ఉండలేకపోతున్న ఒంటరిగా ఫీల్ అవుతున్నానంటూ ఎమోషనల్ గా మాట్లాడిన రాము రాథోడ్ నాగార్జున ఎంత చెప్పినా కూడా వినకుండా హౌస్ నుంచి బయటికి వచ్చేసారు.


అయితే రాము రాథోడ్ వెళ్తూ వెళ్తూ పాట పాడి అందరి చేత ఎమోషనల్ అయ్యేలా చేశారు. నాగార్జున రాముని హౌస్ లో ఉంచడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన రాము మాత్రం వినిపించుకోకుండా హౌస్ లో తాను ఉండలేను సార్.. మా అమ్మ నాన్న గుర్తుకు వస్తున్నారు అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ఇప్పుడే హౌస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతావా? అని అడగగా వెళ్తా సార్ అని చెప్పారు రాము రాథోడ్. నాకు మాట కంటే పాట అంటేనే చాలా ఇష్టం నా మనసులోని బాధను మాటల్లో చెప్పలేకున్నా పాటలో చెప్పగలను అంటూ తెలిపారు.


రాము రాథోడ్ పాడిన పాటకు ఎమోషనల్  అయినా నాగార్జున ఆ తర్వాత రాముని హౌస్ నుంచి బయటికి పంపించేశారు. బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన తర్వాత కూడా రాము పెద్దగా ఎవరితో మాట్లాడినట్టుగా కనిపించలేదు. రాము రాథోడ్ ఒక్కో వారానికి రూ .2 లక్షల రూపాయల వరకు తీసుకున్నట్లుగా వినిపిస్తున్నాయి. మొత్తానికి రాము 9 వారాలకు గాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు 18 లక్షల రూపాయల వరకు అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాము తల్లితండ్రుల మీద ఉన్న ప్రేమను సైతం ప్రశంసిస్తూ సపోర్ట్ చేస్తున్నారు రాము రాథోడ్ అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: