హిందీ సినిమాల ద్వారా క్రేజ్ను సంపాదించుకున్న బ్యూటీ లలో జూన్వి కపూర్ ఒకరు. హిందీ సినిమా ఇండస్ట్రీ లో చాలా సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాక ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ ద్వారా ఈమె కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది.

మరి కొంత కాలం లోనే దేవర పార్ట్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. అందులో కూడా ఈమె హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈమె రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.  ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ నుండి మేకర్స్ ఒక సాంగ్ను విడుదల చేశారు. ఆ సాంగ్ లో జూన్వి కపూర్ తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈమె డేటింగ్ చేయవలసి వస్తే ఓ టాలీవుడ్ హీరో తో డేటింగ్ చేస్తాను అని చెప్పుకొచ్చింది. ఇంతకు ఆ టాలీవుడ్ హీరో ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు ... విజయ్ దేవరకొండ.  జూన్వి కాపూర్ ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ... ఒక వేళ డేటింగ్ చేయవలసి వచ్చినట్లయితే టాలీవుడ్ హీరో అయినటువంటి విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేస్తాను అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: