టాలీవుడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన రాంగోపాల్ వర్మ గురించి చెప్పాల్సిన పనిలేదు. నిరంతరం ఏదో ఒక విషయంలో ఈ డైరెక్టర్ పేరు వైరల్ గా మారుతుంది. ఇప్పుడు నాగార్జున నటించిన శివ సినిమా రీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉన్నారు వర్మ. నవంబర్ 14వ తేదీన ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఇప్పటికే కొన్ని వీడియోలను విడుదల చేశారు. ఇప్పుడు చిరంజీవి కూడా శివ సినిమా పైన ప్రశంసలు కురిపిస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు.


శివ సినిమా చూసి తాను మొదట ఆశ్చర్యపోయానని తెలుగు సినిమాను మార్చేసిన ఒక విప్లవం వంటిది శివ సినిమా, ఒక కొత్త వోరవడికి నాంది పలికింది.. శివ సినిమాలోని సైకిల్ చైన్ సీన్ ఇప్పటికి జనాల మనసులో అలాగే నిలిచిపోయింది. నాగార్జున నటించిన తీరు ఎనర్జీ అన్నీ కూడా సినిమాకి హైలైట్ అయ్యాయి. అలాగే అమల, రఘువరన్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా నటించారని తెలిపారు. ఇలాంటి సినిమా రీ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు చిరంజీవి. అలాగే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అని కూడా ప్రశంసించారు.


తాజాగా రాంగోపాల్ వర్మ చిరంజీవి వీడియో ని షేర్ చేస్తూ ట్విట్టర్ వేదికగా థాంక్యూ చిరంజీవి గారు.. ఈ సందర్భంగా మీకు క్షమాపణలు చెబుతున్నాను.. నా నుంచి అనుకోకుండా నా మాటలు , చేతలు మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించండి మీలాంటి పెద్ద మనసుకి థాంక్స్ అంటూ వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైన రాంగోపాల్ వర్మ ఎప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ఇవేవీ కూడా పట్టించుకోకుండా చిరంజీవి, శివ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెబుతూ వీడియోని విడుదల చేశారు చిరంజీవి. ఈ నేపథ్యంలోనే వర్మ ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

RGV