టాలీవుడ్ లో గ్లామర్, టాలెంట్, గ్రేస్ — ఈ మూడు పదాలకు సమంత అనే పేరు పెట్టవచ్చు అని అనడం అతిశయోక్తి కాదు. సినీ రంగంలో అడుగుపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఆమె చూపించిన పట్టుదల, కృషి, అందం, వ్యక్తిత్వం ఎంతోమందికి ప్రేరణగా మారాయి. ఒకప్పుడు కేవలం తెరపై అందమైన హీరోయిన్‌గా కనిపించిన సమంత, ఇప్పుడు అనేకమంది మహిళలకు ఇన్స్పిరేషన్‌గా మారింది. ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కష్టాలు, కెరీర్‌లో ఎదురైన ఎత్తుపల్లాలు — ఇవన్నీ ఉన్నా కూడా సమంత ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. బలంగా నిలబడి, తన జీవితాన్ని సొంతంగా తీర్చిదిద్దుకున్న ఆత్మవిశ్వాసం ఆమెను మిలియన్ల అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానంలో నిలిపింది.


ఇటీవల సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రతి ఫోటోలోనూ ఆమె ముఖం మీద ఒక కొత్త గ్లో, ఒక కొత్త ప్రశాంతత కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా దర్శకుడు రాజ్ నిడమూరుతో కలిసి ఆమె పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో అగ్గిపెట్టినట్టుగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో కనిపించిన క్లోజ్‌నెస్, కెమిస్ట్రీ చూసి అభిమానులు “ఇద్దరి మధ్య ఏదో స్పెషల్ రిలేషన్ ఉంది” అని కామెంట్లు చేస్తున్నారు.ఇప్పటికే ఫిల్మ్ నగర్ వర్గాల్లో వీరి బంధం దాదాపు అఫీషియల్ అయిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. సమంత ఈ విషయం గురించి పబ్లిక్‌గా ఏమీ చెప్పకపోయినా, ఆమె షేర్ చేస్తున్న పోస్టులు మాత్రం అన్ని చెప్పేస్తున్నాయి. రాజ్ నిడమూరుతో ఆమె స్నేహం క్రమంగా ప్రేమగా మారిందని, ఈ రిలేషన్ ఇప్పుడు నూతన దశలోకి వెళ్ళిందని సినీ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది.



అంతే కాదు, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సమంత మరియు రాజ్ నిడమూరు వచ్చే ఏడాది ప్రారంభంలోనే వివాహ బంధంతో ఒక్కటవబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి సమంత పూర్తిగా తన తల్లి సలహా మేరకు క్రిస్టియన్ పద్ధతిలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. గతంలో నాగచైతన్యతో వివాహం చేసుకున్నప్పుడు ఒకసారి హిందూ సంప్రదాయం, మరోసారి క్రిస్టియన్ పద్ధతి పాటించి పెళ్లి చేసుకుంది. అయితే ఈసారి మాత్రం పూర్తి క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో, చర్చ్ లో జరిగే వెడ్డింగ్ సెరమనీ ప్లాన్ చేస్తున్నారట.ఈ వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. “సమంత మళ్లీ హ్యాపీగా సెటిల్ అవుతుందా?”, “రాజ్ నిడమూరుతో ఆమె జంట ఎలా ఉంటుందో?” అంటూ సోషల్ మీడియాలో చర్చలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా, సమంత జీవితంలో ఈ కొత్త చాప్టర్ అందరికీ ఆసక్తికరంగానే మారింది. ఆమె అభిమానులు ఇప్పుడు ఒక్క మాటే అంటున్నారు — “ఈసారి సమంత హ్యాపీగా ఉండాలి… ఎప్పటికీ చిరునవ్వుతో వెలిగిపోవాలి!”

మరింత సమాచారం తెలుసుకోండి: