ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో అల్లు అర్జున్ లుక్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ అసలే హైలైట్‌గా నిలవబోతుందని అంటున్నారు. “బన్నీ ఇంతకుముందెన్నడూ కనిపించని రఫ్ అండ్ రా యాక్షన్ అవతార్‌లో కనిపిస్తాడు” అంటూ యూనిట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అట్లీ అయితే బన్నీ కోసం ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేశాడని, ఆ స్క్రిప్ట్‌లో ప్రతి సీన్ ఫ్యాన్స్ మైండ్‌బ్లోయింగ్‌గా అనిపించేలా ఉండబోతుందని టాక్.మూవీ కథ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగేలా ఉందని తెలుస్తోంది. ఇందులో అల్లు అర్జున్ ఒక శక్తివంతమైన డాన్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో విలన్ చేత బన్నీని నిజంగానే కొట్టించబోతున్నారని కొన్ని అంతర్గత సమాచారం బయటకు వస్తోంది. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మొదట షాక్ అయ్యారట. “మా హీరోని కొట్టిస్తారా?” అని సోషల్ మీడియాలో వైల్డ్ గా కామెంట్స్ చేస్తున్నారు. కానీ అట్లీ మాత్రం ఈ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ చేయలేదట. “ఆ సీన్ సినిమాకు టర్నింగ్ పాయింట్ అవుతుంది. అక్కడి ఎమోషన్ రియలిస్టిక్‌గా రావాలంటే అదే చేయాల్సి ఉంటుంది” అని ఆయన నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.
ఇక ఈ సినిమా ప్రొడక్షన్ విషయానికి వస్తే, భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అట్లీ ప్రత్యేకంగా ఈ సినిమా కోసం కొన్ని సర్‌ప్రైజింగ్ గెస్ట్ రోల్స్ ని డిజైన్ చేస్తున్నాడట. ఆ రోల్స్ కోసం టాప్ నటులను అప్రోచ్ అవ్వాలని యోచిస్తున్నారని సమాచారం. ఆ గెస్ట్ అప్పియరెన్స్‌లు ఎవరివో అన్న ఆసక్తి కూడా అభిమానుల్లో పెరుగుతోంది.అట్లీ స్టైల్ ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్, అల్లు అర్జున్ ఎనర్జీ — ఈ మిశ్రమం బాక్సాఫీస్‌ను కుదిపేయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి